జ్యోతిక సినిమాపై సూర్య క్లారిటీ

14 Jul, 2016 11:16 IST|Sakshi
జ్యోతిక సినిమాపై సూర్య క్లారిటీ

పెళ్లి తరువాత సినిమాలకు దూరమైన సౌత్ స్టార్ హీరోయిన్ జ్యోతిక 36 వయదినిలే సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చింది. అయితే తొలి ప్రయత్నంలో కమర్షియల్ సక్సెస్ సాధించిలేకపోయిన జ్యోతిక, ఇప్పుడు మరో సినిమాను స్టార్ట్  చేస్తోంది. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది. ఈ సినిమాను సూర్య తన సొంతం నిర్మాణ సంస్థ 2డి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై నిర్మిస్తున్నారు.

ఈ విషయాన్ని హీరో సూర్య స్వయంగా ప్రకటించారు. గురువారం ఈ సినిమా ప్రారంభం అవుతుందన్న సూర్య పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడిస్తామని చెప్పారు. ఇటీవల 24 సినిమాతో సూపర్ హిట్ కొట్టిన సూర్య, ప్రస్తుతం హరి దర్శకత్వంలో సింగం సీరీస్లో మూడో సినిమాగా తెరకెక్కుతున్న ఎస్3లో హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమా తరువాత సూర్య, జ్యోతిక కాంబినేషన్లో ఓ సినిమాను ప్లాన్ చేస్తున్నారు.