జ్యోతిక రెడీ...

29 Apr, 2014 22:22 IST|Sakshi
జ్యోతిక రెడీ...

 పెళ్లయ్యాక కూడా కథానాయికలుగా కొనసాగడం బాలీవుడ్ భామలకే చెల్లింది. దక్షిణాదిలో ఒకప్పుడు ఈ సంప్రదాయం ఉండేది కానీ, ఇప్పుడైతే లేదు. పెళ్లయ్యాక మళ్లీ నటించాల్సి వస్తే... కేరక్టర్‌యాక్టర్‌గా చేయడమే తప్ప హీరోయిన్‌గా నటించడం మాత్రం అరుదు. ఒక వేళ నటించినా రాణించడం మాత్రం ఇక్కడ జరగలేదు. అందుకు సిమ్రాన్‌ని, భూమికని ఉదాహరణగా చెప్పొచ్చు. రీసెంట్‌గా స్నేహ కూడా ‘ఉలవచారు బిరియాని’ చిత్రంతో హీరోయిన్‌గా రీ ఎంట్రీ ఇస్తున్నారు. ఈ వరుసలో మరో పాత స్టార్ హీరోయిన్ కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారట.
 
  ఆమె ఎవరో... ఇక్కడున్న స్టిల్ చూశాక మీకు అర్థమై ఉంటుంది. సూర్యని వివాహం చేసుకున్న తర్వాత ఇంటికే పరిమితమైపోయారు జ్యోతిక. ఇప్పుడామెకు ఓ పాప, ఓ బాబు. ఆ మధ్య ఓ వాణిజ్య ప్రకటనలో సూర్యతో కలిసి నటించి, ‘ఇద్దరు బిడ్డల తల్లినైనా... నా గ్లామర్‌లో ఏ మాత్రం మెరుపు తగ్గలేదు’ అని నిరూపించారామె. అందుకే తన భర్త సూర్య నుంచి ఇంట్లోవారందరూ ఆమె మళ్లీ నటన కొనసాగించడానికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చేశారట. ప్రస్తుతం జ్యోతిక కథలు వింటున్నారు. తమిళ దర్శకుడు  పాండిరాజ్ చెప్పిన కథ నచ్చిందని వినికిడి. కథానాయిక ప్రాధాన్యంతో సాగే ఈ చిత్రం ద్వారా జ్యోతిక హీరోయిన్‌గా రీ-ఎంట్రీ ఇవ్వనున్నట్లు సమాచారం.
 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి