మళ్లీ కెమేరా ముందుకు...

17 Nov, 2014 23:54 IST|Sakshi
మళ్లీ కెమేరా ముందుకు...

చాలా విరామం తర్వాత జ్యోతిక మళ్లీ నటిగా మేకప్ వేసుకున్నారు. సూర్యను పెళ్లి చేసుకుని, ఇద్దరు బిడ్డలకు తల్లయిన జ్యోతిక ఇంతకాలం పూర్తిగా ఇంటికే పరిమితమయ్యారు. ఇప్పుడు పిల్లలు కొంచెం పెద్దవాళ్లు కావడంతో మళ్లీ నటించాలని నిర్ణయించుకున్నారు. సెకండ్ ఇన్నింగ్స్‌లో ఆమె చేస్తున్న తొలి చిత్రం షూటింగ్ సోమవారం న్యూఢిల్లీలో ఆరంభమైంది. ఈ చిత్రాన్ని 2డి ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై స్వయంగా సూర్య నిర్మిస్తుండటం విశేషం. మలయాళ చిత్రం ‘హౌ ఓల్డ్ ఆర్ యూ’కి ఇది రీమేక్. మలయాళ చిత్రానికి దర్శకత్వం వహించిన రోషన్ ఆండ్రూస్ దర్శకత్వంలోనే ఈ చిత్రం రూపొందుతోంది. ఇందులో మూడు పదుల వయసు వివాహితగా నటిస్తున్నారు జ్యోతిక.