ద‌ర్శకేంద్రుడి సార‌థ్యంలో ‘ఆధ్యాత్మ రామాయ‌ణం- బాల‌కాండ‌’

26 Dec, 2018 15:52 IST|Sakshi

విద్య‌, విజ్ఞానం, సంస్కృతి, క‌ళ‌ల ద్వారా స‌మాజ సేవ చేయ‌డ‌మే ల‌క్ష్యంగా గ‌త 10 సంవత్సరాలుగా విశేష కృషి చేస్తున్న పద్మా మోహన్‌ గారి సారధ్యంలో రూపొందిన డాక్యుమెంటరీ చిత్రం ‘ఆధ్యాత్మ రామాయ‌ణం- బాల‌కాండ’. ఆంధ్ర నాట్యం మీద అవ‌గాహ‌న క‌ల్పించ‌డానికి ఆధ్యాత్మ రామాయ‌ణ కీర్తన‌ల‌తో ఈ డాక్యుమెంట‌రీ ఫిలిమ్‌ను శ్రీమ‌తి దెందులూరి ప‌ద్మామోహ‌న్‌, ఆమె కుమార్తె దెందులూరి మూర్తి అఖిల జ్యోతి స్వయంగా న‌ర్తించి స‌మ‌ర్పిస్తున్నారు. 

క‌ళాకృష్ణ నృత్య ద‌ర్శక‌త్వంలో ద‌ర్శకేంద్రుడు కె.రాఘ‌వేంద్రరావు నిర్మాణ నేతృత్వ సార‌ధ్యంలో మీర్ ద‌ర్శక‌త్వంలో ఈ డాక్యమెంట‌రీ రూపొందింది. దీనికి సంబంధించిన పాత్రికేయుల స‌మావేశంలో మంగ‌ళ‌వారం హైద‌రాబాద్‌లో నిర్వహించారు. ఈ సందర్భంగా సాహిత్య విశిష్ట కృషి పుర‌స్కారాన్ని ప్రముఖ సినీ గేయ ర‌చ‌యిత సిరివెన్నెల సీతారామ‌శాస్త్రికి అందజేశారు. రామ‌క‌మ‌ల్ ల్యాబ్స్ ప్రొప్రైట‌ర్ పి.ఎస్‌.శ్రాస్త్రి, ప్రఖ్యాత హ‌రిక‌థా విద్వాంసురాలు శ్రీమ‌తి ఉమామ‌హేశ్వరి, ప్రముఖ యోగా శిక్షకులు జి.చంద్రకాంత్‌ల‌ను స‌న్మానించారు.

ఈ సందర్భంగా రాఘ‌వేంద్రరావు మాట్లాడుతూ - ‘మ‌న పిల్లల‌కి సంస్కృతి, సంప్రదాయాలు, క‌ళ‌ల‌ను నేర్పించాల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉంది. ఆ అవ‌శ్యక‌త‌ను గుర్తించి ఓ షౌండేష‌న్‌ను స్టార్ట్ చేసి సేవా కార్యక్రమాల‌ను నిర్వహిస్తున్న న‌ళినీ మోహ‌న్‌, ప‌ద్మా మోహ‌న్‌ల‌కు అభినంద‌నలు తెలుపుతున్నాను’ అన్నారు. నృత్య దర్శకుడు క‌ళా కృష్ణ మాట్లాడుతూ - ‘నాట్యంలోని అభిరుచి గురించి ప్రపంచానికి తెలియ‌జేయాల‌ని ప్రయ‌త్నం చేస్తున్న దెందులూరి ఫౌండేష‌న్‌కు నా స‌హ‌కారం ఎప్పుడూ ఉంటుంద’న్నారు. 

మరిన్ని వార్తలు