గొప్ప సంగీతభరిత చిత్రాన్ని చూశా

8 Mar, 2019 03:47 IST|Sakshi
‘సర్వం తాళమయం’లో ఓ దృశ్యం

– కె.విశ్వనాథ్‌

‘శంకరాభరణం, సాగరసంగమం’ వంటి అద్భుత సంగీతభరిత చిత్రాలను అందించారు కళా తపస్వి   కె.విశ్వనాథ్‌. సంగీతం నేపథ్యంలో రాజీవ్‌ మీనన్‌ తెరకెక్కించిన చిత్రం ‘సర్వం తాళమయం’. జీవీ ప్రకాష్, అపర్ణ బాలమురళి జంటగా నటించారు. నెడుముడి వేణు, వినీత్, దివ్యదర్శిని ఇతర ముఖ్య పాత్రల్లో నటించిన ఈ సినిమా ఈరోజు విడుదలవుతోంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ‘సర్వం తాళమయం’ చిత్రాన్ని  వీక్షించిన అనంతరం కె.విశ్వనాథ్‌ మాట్లాడుతూ– ‘‘చాలా కాలం తర్వాత ఒక గొప్ప సంగీత భరిత చిత్రాన్ని చూశాను.

రాజీవ్‌ మీనన్‌ ఈ చిత్రాన్ని చాలా బాగా తీశారు. ఆద్యంతం హృదయాన్ని హత్తుకునే భావోద్వేగాలతో ఈ సినిమాను రూపొందించారు. పైగా ఒక మంచి సందేశాన్ని కూడా అందించిన రాజీవ్‌ మీనన్‌కి నా ఆశీర్వాదాలు’’ అన్నారు. రాజీవ్‌ మీనన్‌ మాట్లాడుతూ– ‘‘దర్శకులు చంద్రశేఖర్‌ యేలేటి, నాగ్‌ అశ్విన్, మహి వి. రాఘవ్‌ తదితరులు మా చిత్రాన్ని చూసి అభినందించడం సంతోషంగా ఉంది. ఏఆర్‌ రహమాన్‌ సంగీతం ఈ చిత్రానికి ప్రాణం’’ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: రవి యాదవ్, నిర్మాత: లత.

మరిన్ని వార్తలు