‘అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు’ పై కేఏ పాల్‌ స్పందన

14 Dec, 2019 20:09 IST|Sakshi

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన ‘అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు’ సినిమాపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్‌ స్పందిచారు. అమెరికా నుంచి స్కైప్‌ ద్వారా మీడియాతో మాట్లాడుతూ.. కులాల మధ్య చిచ్చు పెట్టే విధంగా వర్మ చిత్రాన్ని రూపొందించాడని మండిపడ్డారు. తన పేరును కూడా వాడుకోలేని దుస్థితి రామ్‌ గోపాల్‌ వర్మది అని ఎద్దేవా చేశారు.  ప్రజల మధ్య గొడవలు రేకెత్తించేలా సినిమా ఉందన్నారు. వర్మ నోరు విప్పితే అబద్దాలేనని దుయ్యబట్టారు.

(చదవండి : నన్ను చూసి'నారా'!)

ఇకపోతే సెన్సార్ బోర్డు ఆదేశాలతో సినిమాలోని కొన్ని సీన్లను కత్తిరించి.. ఆపై చిత్రాన్ని విడుదల చేశారని పాల్ చెప్పుకొచ్చారు. అయితే సినిమా విషయంలో మాత్రం తుది గెలుపు తమదే అయ్యిందన్నారు. వర్మ ఇప్పటికైనా తనను క్షమాపణ కోరితే మంచిదని లేకపోతే చరిత్రహీనుడిగా మిగిలిపోతాడని విమర్శించారు. ప్రస్తుతం అమెరికాలో ఉన్న కేఏ పాల్.. ప్రపంచశాంతి కోసం తిరుగుతున్నానన్నారు. ట్రంప్‌ను కలిసేందుకే అమెరికాకు వెళ్లానని తెలిపారు. కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా తనతో మాట్లాడాడని చెప్పకొచ్చారు. తనకు పబ్లిసిటీ అవసరమే లేదని.. తాను ఎన్నికలను మార్చిలోనే బహిష్కరించానని తెలిపారు.

>
మరిన్ని వార్తలు