తగ్గని కబీర్‌ సింగ్‌ జోరు.. రికార్డు కలెక్షన్లు!

27 Jun, 2019 17:59 IST|Sakshi

ముంబై: షాహిద్ కపూర్, కియారా అద్వానీ జంటగా నటించిన కబీర్ సింగ్ సినిమా బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. వీక్‌ డేస్‌లోనూ అద్భుతంగా వసూళ్లు రాబడుతూ.. సినీ పరిశీలకులను సైతం ఆశ్చర్యపరుస్తోంది. కేవలం ఐదు రోజుల్లోనే రూ. 100 కోట్ల క్లబ్‌లో చేరిన ఈ సినిమా ఆరోరోజు బుధవారం రూ. 15.91 కోట్ల కలెక్షన్‌ రాబట్టింది. దీంతో ఆరో రోజుల్లో ఈ సినిమా మొత్తం కలెక్షన్లు రూ. 120.80 కోట్లకు చేరుకుంది. 

దేశమంతటా 3123 స్క్రీన్లలో విడుదలైన ఈ చిత్రం సింగిల్ స్క్రీన్లతోపాటు మల్టీప్లెక్స్‌ల్లోనూ  దూసుకుపోతుంది. అర్జున్ రెడ్డి సినిమాకు హిందీ రీమేక్‌గా వచ్చిన కబీర్ సింగ్‌కు ఇప్పటికీ బాక్సాఫీస్‌ వద్ద క్రేజ్‌ తగ్గడంలేదు. కలెక్షన్ల జోరును చూస్తుంటే.. అలవోకగా ఈ సినిమా రెండువందల కోట్ల మార్క్‌ను దాటే అవకాశం కనిపిస్తోంది. 

ఈ ఏడాది బడాబడా బాలీవుడ్‌ స్టార్ల సినిమాలు కూడా వీక్‌ డేస్‌లో పెద్దగా వసూళ్లు రాబట్టలేదు. వందకోట్ల క్లబ్‌లో చేరడానికి బడా స్టార్లు కూడా బాక్సాఫీస్‌ వద్ద ఎక్కువ రోజులు తీసుకున్నారు. ఈ ఏడాది వచ్చిన సల్మాన్‌ భారత్‌ సినిమా నాలుగు రోజుల్లో వందకోట్ల క్లబ్‌లో చేరగా.. ఐదు రోజుల్లో ఈ మార్క్‌ను అందుకొని.. రెండో సినిమాగా కబీర్‌సింగ్‌ నిలిచింది. ఆ తర్వాత 7 రోజులకు అక్షయ్‌కుమార్‌ కేసరి, 8 రోజులకు రణ్‌బీర్‌ కపూర్‌ గల్లీబాయ్‌, 9 రోజులకు అజయ్‌ దేవ్‌గన్‌ టోటల్‌ ధమాల్‌ సినిమాలు వందకోట్ల క్లబ్బులో చేరాయి. 
 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు