కైలాష్ ఖేర్ ‘సూఫీ పాట’కి మంచి స్పంద‌న

27 May, 2020 17:22 IST|Sakshi

ప్రస్తుత జనరేషన్‌ని ప్రతిబింబించేలా పెళ్లి, సహజీవనంలో ఉన్న రెండు జంటల కథతో రాబోతున్న చిత్రం ‘మ్యాడ్’. ఈ మూవీ ఫస్ట్ లుక్‌ని ఇటీవల చిత్ర బృందం విడుదల చేసిన విషయం తెలిసిందే. ఫ‌స్ట్లుక్‌లో అందరినీ ఆకర్షించిన మ్యాడ్ మూవీ తాజాగా ఓ సుఫీ పాటతో త‌న ప్ర‌త్యేక‌త‌ను చాటుకుంది. తెలుగు పాట‌ల్లో చాలా అరుదుగా క‌నిపించే సుఫీ పాట‌ ‘మ్యాడ్‌’ చిత్రానికి ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలుస్తోంది.  ‘బందిషీ ఖాత‌ల్ దిల్ కీ’ అంటూ సాగే ఈ పాట కైలాష్ ఖేర్ పాడారు. ఈ పాటతో కైలాష్ ఖేర్ గొంతు తెలుగు ప్రేక్ష‌కుల మ‌న‌సులో శాశ్వత స్థానం సంపాదించుకుంది. మోహిత్ రెహ్మానిక్ స్వ‌రప‌ర‌చిన ఈ సుఫీని శ్రీమాన్ శ్రీమ‌న‌స్వి ర‌చించారు.
 

మోదెల టాకీస్ బ్యాన‌ర్‌పై టి. వేణు గోపాల్ రెడ్డి, బి. కృష్ణారెడ్డి నిర్మాత‌లుగా.. లక్ష్మణ్ మేనేని ద‌ర్శ‌క‌త్వంలో రూపోందిన ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనులను ప్రస్తుతం వేగంగా జరుపుకుంటోంది. త్వరలో విడుదలకు సిద్ధమవుతున్న ఈ సినిమాలో మాధవ్ చిలుకూరి, స్పందన పల్లి, రజత్ రాఘవ్, శ్వేతవర్మ  లీడ్‌ రోల్స్‌లో కనిపించనున్నారు. ‘కైలాష్ ఖేర్ ఈ పాట‌ను పాడటానికి ఒప్పుకోవ‌డం చాలా అదృష్టంగా భావిస్తున్నాం. సినిమాలో ఓ ఎమోష‌న‌ల్ సన్నివేశంలో ఈ పాట వ‌స్తుంది. క‌థలోని ఫీల్‌కి సుఫీ పాట అయితే కొత్తగా ఉంటుందని అనుకున్నాం. మ్యూజిక్ డైరెక్ట‌ర్ ఇచ్చిన ట్యూన్ చాలా బాగుంది. కైలాష్ ఖేర్ పాట విన్నాక మాకు చాలా సంతోషంగా ఉంది’ అని డైరెక్టర్ లక్ష్మణ్ మేనేని అన్నారు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు