కాజల్‌ అక్కడ కూడా ఎంట్రీ ఇచ్చింది

25 Nov, 2019 09:15 IST|Sakshi

చెన్నై: కాజల్‌అగర్వాల్‌ను తాజాగా కర్ణాటక ఆహ్వనించింది. కళాకారులకు భాషా బేధం ఉండదన్నది ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ముఖ్యంగా ఈ సౌలభ్యం ఎక్కువన్నది విధితమే. ఒక భాషలో నటించిన చిత్రం విజయం సాధిస్తే వెంటనే ఇతర భాషా దర్శకులు ఆ చిత్రాలపై, అందులో నటించిన హీరోయిన్లపైనా దృష్టిసారిస్తారు. అలా ప్రస్తుతం హీరోయిన్లుగా నటిస్తున్న వారందరూ బహుభాషా నటీమణులగా పేరు తెచ్చుకుంటున్నారని చెప్పవచ్చు. నటి కాజల్‌అగర్వాల్‌ కూడా బహుభాషా నటినే. బాలీవుడ్‌లో రంగప్రవేశం చేసి ఆ తరువాత టాలీవుడ్, కోలీవుడ్‌లలో ప్రవేశించి టాప్‌ హీరోయిన్లలో ఒకరిగా రాణిస్తోంది. అయితే దక్షిణాది భాషల్లో ఒకటైన కన్నడంలో ఈ బ్యూటీ ఇప్పటి వరకూ నటించలేదు. అలాంటిది తాజాగా అక్కడ కూడా ఎంట్రీ ఇచ్చేసింది.

కన్నడంతో సంచలన నటుడిగా ముద్రవేసుకున్న ఉపేంద్రతో జతకడుతోంది. కబ్జా అనే చిత్రంలో ఈ జంట నటిస్తున్నారు. ప్రస్తుతం టాలీవుడ్‌లో అవకాశాలు తగ్గాయి. తమిళంలో కమలహాసన్‌కు జంటగా శంకర్‌ దర్శకత్వంలో ఇండియన్‌–2 చిత్రంలో నటిస్తోంది. ఈ రెండు భాషల్లోనూ మరో అవకాశం లేకపోవడంతో కన్నడ పరిశ్రమపై దృష్టి సారించింది. అయితే అక్కడ త్రిష, నయనతార వంటి వారు నటించినా పేద్దగా పేరుతెచ్చుకోలేకపోయారు. మరి కాజల్‌అగర్వాల్‌కు  శాండిల్‌వుడ్‌లో భవిష్యత్‌ ఎలా ఉంటుందో చూడాలి. అక్కడ ఒక రౌండ్‌ కొడుతుందా లేక ఒకటి రెండు చిత్రాలతోనే సరిపెట్టుకుంటుందా అన్న ఆసక్తి మాత్రం సినీ వర్గాల్లో నెలకొంది. కాగా శాండిల్‌వుడ్‌ ఎంట్రీ గురించి కాజల్‌ మాట్లాడుతూ తాను నటించే ప్రతి చిత్రాన్ని తొలి చిత్రంగానే భావిస్తానని చెప్పింది. ఇప్పుడు కన్నడంలో మొదటి సారి నటిస్తున్నాను. ఈ అనుభవం కొత్తగా ఉంది అని పేర్కొంది. ఈ చిత్రాన్ని ఏడు భాషల్లో విడుదల చేయనున్నారని తెలిపింది.

ఇప్పటికి 50 చిత్రాలను పూర్తి చేశానని, వంద చిత్రాలను పూర్తి చేయడమే తన లక్ష్యమని కాజల్‌అగర్వాల్‌ పేర్కొంది. అయితే లక్ష్యంపెద్దదిగానే ఉంది. అందుకు మరో 10, 15 ఏళ్లు పడుతుందే. అప్పటికి వయసు ప్రభావం చూపదా? అయినా నూరు చిత్రాల్లో నటించడమే తన లక్ష్యం అంటోంది గానీ, హీరోయిన్‌గానే అని అనలేదు కాబట్టి అక్కగా, వదినగా అయినా తన టార్గెట్‌ను పూర్తి చేసుకుంటుందేమో. అన్నట్టు ఈ జాణ నటించిన ఏకైక హీరోయిన్‌ ఓరియెంటెడ్‌ కథా చిత్రం ప్యారిస్‌ ప్యారిస్‌ చిత్రం నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకున్నా, విడుదలకు మోక్షం కలగలేదు. 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు