మిస్ కాజల్... ఇక అఫీషియల్!

6 May, 2016 00:19 IST|Sakshi
మిస్ కాజల్... ఇక అఫీషియల్!

కొన్ని హెడ్డింగ్స్ చదవగానే డైలమాలో పడిపోవడం ఖాయం. ‘మిస్ కాజల్.. ఇక అఫీషియల్’ అని చదవగానే అలానే అయిపోతారు. కాజల్ అగర్వాల్ ఇంకా మిసెస్ కాలేదనే విషయం అందరికీ తెలిసిందే. మరి.. ప్రత్యేకంగా ‘మిస్ కాజల్.. ఇక అఫీషియల్’ అని ఎందుకు అన్నట్లు అనుకుంటున్నారా? ఆ విషయానికే వస్తున్నాం. ఇన్నాళ్లూ కాజల్ ముఖపుస్తకం.. అదేనండి ‘ఫేస్‌బుక్’ ద్వారా అభిమానులకు అందుబాటులో ఉండేవారు.

ఎలానూ ఫేస్‌బుక్‌లో ఉన్నారు కాబట్టి, ట్విట్టర్‌లో కూడా కాజల్‌కి అకౌంట్ ఉండే ఉంటుందని చాలామంది ఊహ. అందుకు తగ్గట్టుగా ఈ బ్యూటీ పేరు మీద బోల్డన్ని అకౌంట్లు పుట్టుకొచ్చాయి. కానీ, అన్నీ నకిలీవే. వీలు కుదిరినప్పుడల్లా ‘నేను ట్విట్టర్‌లో లేను.. ఓన్లీ ఫేస్‌బుక్‌లో ఉన్నా’ అని చెబుతూ వచ్చారు కాజల్. ఇలా చెప్పి చెప్పి విసుగు పుట్టిందేమో.. నిజంగానే ట్విట్టర్‌లో అకౌంట్ ఓపెన్ చేసి పారేశారు.

‘ఃమిస్‌కాజల్‌అగర్వాల్’ అన్నది కాజల్ ట్విట్టర్ ఐడి. సో.. ఇన్నాళ్లూ కాజల్ నకిలీ అకౌంట్లు హల్‌చల్ చేశాయి. ఇప్పుడు అసలు అకౌంట్ ఆరంభించడంతో అభిమానులు ఆనందపడుతున్నారు . అకౌంట్ ఓపెన్ చేసిన 23 గంటల్లో పాతిక వేలకు పైగా ఫాలోయర్స్‌ని సంపాదించేసుకున్నారామె. మరి.. కాజలా? మజాకానా?