అల్లరి నరేష్‌కు జోడీగా కాజల్‌!

13 Mar, 2020 14:26 IST|Sakshi

లక్ష్మీ కళ్యాణం సినిమాతో సినిమా రంగానికి పరిచయమైన కాజల్‌ అగర్వాల్‌ ప్రస్తుతం స్టార్‌ హీరోయిన్‌గా రాణిస్తున్నారు. సినిమాల్లోకి అడుగుపెట్టి 12 ఏళ్లు గడుస్తున్న వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఇప్పటికే దుల్కర్‌ సల్మాన్‌తో కలిసి ‘హే సినామికా’ సినిమా చేయనున్నట్లు కాజల్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ చిత్రంలో మరో కథానాయికగా అదితి రావు హైదరీ నటిస్తున్నారు. కొరియోగ్రాఫర్‌ బృందా ఈ సినిమాతో దర్శకురాలిగా పరిచయం కానున్నారు. అలాగే కమల్‌ హాసన్‌ భారతీయుడు 2 లోనూ కీలక పాత్రలో నటిస్తున్నారు. అదే విధంగా మంచు విష్ణు హీరోగా నటిస్తోన్న మోసగాళ్లు సినిమాల్లో నటిస్తున్నారు.
(హే సినామికా)

ఇదిలా ఉండగా కాజల్‌ త్వరలో కొరియన్‌ సినిమా రీమేక్‌లో నటించనున్నట్లు సమాచారం.ఇప్పటికే గతేడాది సురేష్ ప్రొడక్షన్ బ్యానర్‌లో సమంత.. ‘ఓ బేబి’ సినిమా చేసిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం కొరియాలో హిట్టైయిన ‘మిస్ గ్రానీ’ సినిమాకు రీమేక్‌గా తెరకెక్కింది. తాజాగా 2012లో విడుదలై కొరియన్‌లో సూపర్‌ హిట్‌ సాధించిన ‘డ్యాన్సింగ్‌ క్వీన్‌’ను తెలుగులో సురేష్‌ బాబు తెరకెక్కించనున్నారు. ఇప్పటికే ఈ సినిమా రీమేక్‌ హక్కులను కొనుగోలు చేయగా.. హీరో పాత్రలో అల్లరి నరేష్‌ నటించనున్నారు. మహేష్‌ బాబు ‘మహర్షి’ సినిమాతో అల్లరి నరేష్‌కు సెంకడ్‌ ఇన్నింగ్స్‌ స్టార్ట్‌ అయ్యిందని చెప్పవచ్చు.(డైరెక్టర్‌గా మారిన ప్రముఖ కొరియోగాఫ్రర్‌)

అయితే ఈ సినిమాలో అల్లరి నరేష్ సరసన కాజల్ నటించబోతోన్నట్లు తెలుస్తోంది. ఇందుకు ఇప్పటికే కాజల్‌ను సంప్రదించినట్లు సురేష్‌ బాబు చెప్పారు. అయితే ప్రస్తుతం చర్చ నడుస్తోందని ఈ నెల చివరలో స్పష్టత ఇస్తామంటూ ఆయన వెల్లడించారు. ‘డాన్సింగ్ క్వీన్’.. సింగర్‌ కావాలని కోరుకునే ఓ యువతి జీవితం చుట్టూ తిరిగే కథ. ఈ సినిమా షూటింగ్‌ మే మొదటి వారంలో ప్రారంభం కానున్నట్లు సమాచారం. ఈ సినిమాకు దర్శకుడిని మాత్రం ఖరారు చేయలేదు.(ఉత్కంఠ రేపుతున్న అల్లరి నరేష్‌ న్యూ లుక్‌..!)

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా