అదో తీయని అనుభవం

3 Sep, 2016 01:49 IST|Sakshi
అదో తీయని అనుభవం

‘ నాకు ప్రేమకు వేళైంది. ఇక ఆ అనుభవాన్ని చవిచూడాలనే నిర్ణయానికి వచ్చాను. ప్రేమను వర్ణించడం సాధ్యం కాదు. అదో తీయని అనుభవం.’ ఇలా అన్నది ఎవరనుకుంటున్నారు ఇంకెవరు చెల్లెలి పెళ్లి చేసి తాను మాత్రం ఇంకా ఒంటరి జీవితాన్నే గడిపేస్తూ నటనను ఎంజాయ్ చేస్తున్న నటి కాజల్‌అగర్వాలే. మార్కెట్ డౌన్ అయ్యింది ఇక మూటాముల్లె సర్దేసుకుని పెళ్లి చేసుకుని సంసార జీవితంలో మునిగిపోదాం అన్న నిర్ణయానికి వచ్చేసిన తరుణంలో అనూహ్యంగా అవకాశాలు ముంచెత్తడంతో పెళ్లి ఆలోచనను వాయిదా వేసుకుని బిజీగా నటిస్తున్న కాజల్ ఆలోచనలు తాజాగా మరోసారి ప్రేమపైకి మళ్లినట్లున్నాయి.
 
  ఈ మధ్య ఈ బ్యూటీ నోట పదే పదే ప్రేమ మాట వినిపిస్తోంది. ఇటీవల కాజల్ ఒక భేటీలో పేర్కొన్న అంశాలను చూద్దాం. ‘ఆడవారి విషయంలో మగవారి ఆలోచనాధోరణి మారాలి.ఎందుకంటే మహిళలు పురుషులతో సమానంగానే కాదు వారికంటే అధికంగా సంపాదిస్తున్నారు. పాత కాలంలో మాదిరి ఇంటి పనులు చేయాలని మహిళల్ని పురుషులు ఒత్తిడి చేయకూడదు. అంతే కాదు వారూ ఇంటి పనులు చేయాలి. ఇక ప్రేమ విషయానికి వస్తే అది వర్ణించడానికి కాని తీయని అనుభవం. ఇప్పటి వరకూ నేనెవరినీ ప్రేమించలేదు. అయితే ఇక ప్రేమించాలన్న నిర్ణయానికి వచ్చాను.
 
 ప్రేమించడానికి ఏ రాజకుమారుడో అక్కర్లేదు. ఎవరైనా నాకు ఆక్షేపణ తేదు. నాకు తగిన జోడీ అయితే చాలు. అతనికి ఎలాంటి లక్షణాలు ఉండాలని మీరు అడగవచ్చు. నా భావాలను అర్థం చేసుకునేవాడై ఉండాలి. నా ఆలోచనలు గౌరవించాలి. నాపై పూర్తిగా నమ్మకం ఉంచాలి. తను సొంత జీవితం కంటే నా జీవితానికి ప్రాముఖ్యతనివ్వాలి. నా అవసరాలను పూర్తి చేయాలి. అలాంటి వ్యక్తినే నేను ప్రేమిస్తాను. నేనూ సాధారణ అమ్మాయినే. నాకూ కలలు, కోరికలు ఉంటాయి కదా’ అన్న కాజల్ తెలుగు చిత్రం జనతా గ్యారేజ్ చిత్రంలో ఐటమ్ సాంగ్‌లో దు మ్మురేపారంటున్నాయి సినీ వర్గాలు.