ఆ కల ఎప్పుడు నెరవేరుతుందో?

12 Oct, 2016 23:04 IST|Sakshi
ఆ కల ఎప్పుడు నెరవేరుతుందో?

‘‘ప్రేమ వివాహమా? పెద్దలు కుదిర్చిన వివాహమా? అనేది చెప్పలేను. ఎందుకంటే.. నేనింకా ఎవర్నీ ప్రేమించలేదు. ఇప్పట్లో పెళ్లి చేసుకునే ఆలోచన కూడా లేదు. పెళ్లి ఘడియలు వచ్చినప్పుడు సంతోషంగా అందరికీ చెబుతా’’ అంటున్నారు కాజల్ అగర్వాల్. ప్రేమ, పెళ్లి, చెల్లి.. ఇలా వ్యక్తిగత జీవితం గురించి కాజల్ బోలెడు కబుర్లు చెప్పారు.

♦  మేజర్ (18 ఏళ్లు నిండిన) అయిన తర్వాత నా జీవితంలో చాలా మార్పులొచ్చాయి. జీవితాన్ని చూసే విధానంలో మార్పొచ్చింది. ‘మనం చిన్న పిల్లలం కాదు.. పెద్దవా ళ్లలా వ్యవహరించాలి’ అనుకుని ఏదో ఆరిందాలా బిహేవ్ చేయడం మొదలుపెట్టా.
♦  బాధ్యతతో మెలగడం, సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకొనే సామర్థ్యం ఉండడం నా బలం. ఎక్కువగా ఎమోషనల్ కావడం నా బలహీనత.
♦ ఇంట్లో ముద్దుగా కాజూ, గుడియా.. అని పిలుస్తుంటారు. నిషాని నేను చెల్లెలిలా మాత్రమే కాదు.. బెస్ట్ ఫ్రెండ్‌లా భావిస్తా. షూటింగ్ లేనప్పుడు ఇంట్లోనే ఉంటా. ఫ్యామిలీతో సరదాగా కబుర్లు చెప్పుకుంటూ భోజనం చేయడమంటే ఇష్టం. రాజ్మా చావల్, పన్నీర్ నా ఫేవరేట్ ఐటమ్స్. పక్కన ఎవరూ లేరంటే పుస్తకాలతో దోస్తీ చేస్తా. నేనిష్టపడిన వ్యక్తులతో గడిపిన క్షణాలన్నీ మధురమైన జ్ఞాపకాలే.
♦  మల్టీ హీరోయిన్ ఉన్న సినిమాలు చాలా చేశా. వర్క్ పరంగా ఏ   హీరోయిన్‌తోనూ సమస్యలు లేవు. బయటి హీరోయిన్లతో చేశాన  కానీ నా చెల్లెలితో కలసి ఇప్పటివరకూ ఒక్క సినిమా కూడా చేయలేదు. తనతో కలసి నటించాలనుంది.
♦   హీరోయిన్ కాకపోతే మీరు ఏమయ్యేవారు? అనే ప్రశ్న చాలాసార్లు ఎదురైంది. బహుశా.. ఫొటోగ్రాఫర్ లేదా ట్రావెలర్ లేదా ఏదైనా మల్టీనేషనల్ కంపెనీలో పనిచేస్తూ ఉండేదాన్నేమో! నా డ్రీమ్ జాబ్ అంటే గరిటె తిప్పడమే. షెఫ్ (స్టార్ హోటల్‌లో వంట చేసేవారు) అయ్యేదాన్ని. సొంతంగా రెస్టారెంట్ స్టార్ట్ చేసేదాన్ని.
♦  నా ఫేవరెట్ హాలిడే స్పాట్ లండన్. అయితే.. నేనెక్కువసార్లు వెళ్లిన దేశం స్విట్జర్లాండ్. ఇండోనేషియా బాగా నచ్చింది. తూర్పు ఐరోపా, నార్వే, ఐస్‌ల్యాండ్ దేశాల్లో సీనరీలు బాగుంటాయి.
♦ సినిమాలకు వస్తే.. ఇప్పటివరకూ డిఫరెంట్ క్యారెక్టర్స్ చేశాను. కంప్లీట్ యాక్షన్ రోల్ చేయాలనేది నా డ్రీమ్. ఆ కల ఎప్పుడు
 నెరవేరుతుందో?