అది మాత్రం ఎవరికీ చెప్పను: కాజల్‌

3 Nov, 2019 08:14 IST|Sakshi

తమిళసినిమా: అది మాత్రం చెప్పను అంటోంది నటి కాజల్‌ అగర్వాల్‌. ఇంతకీ ఏమిటీ గొడవ అనేగా మీ ప్రశ్న. ఈ ముంబై బ్యూటీ గురించి ఇటీవల పలు రకాలుగా వార్తలు ప్రచారం అవుతున్నాయి. నటిగా దశాబ్దంన్నరకు చేరుకోవడంతో పెళ్లి గురించి ఎక్కువగా ప్రచారం జరుగుతోంది. కాజల్‌కు పెళ్లి కళ వచ్చేసిందని, ఒక పారిశ్రామికవేత్తతో ఏడడుగులు నడవడానికి సిద్ధం అవుతోందని ఇలా వార్తలు దొర్లుతున్నాయి. ముఖ్యంగా ఇండియన్‌–2 చిత్రంలో కాజల్‌అగర్వాల్‌ 85 ఏళ్ల వృద్ధురాలిగా నటిస్తోందనే టాక్‌ సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది. సాధారణంగా దర్శకుడు శంకర్‌ చిత్రాలకు సంబంధించిన వివరాలు అంతసులభంగా బయటకు రావు. అలాంటిది కాజల్‌ అగర్వాల్‌ పాత్రకు సంబంధించిన విషయాలు బయటకు రావడానికి ఒక రకంగా తనే కారణం. కమలహాసన్‌ కథానాయకుడిగా శంకర్‌ దర్శకత్వంలో లైకా సంస్థ నిర్మిస్తున్న చిత్రం ఇండియన్‌–2. ఈ చిత్రంలో నటించే విషయం గురించి నటి కాజల్‌ అగర్వాల్‌ ఎక్కువగా ప్రచారం చేసుకోవడంలో ఆమె పాత్ర గురించి రకరకాల ఊహాగానాలు ప్రచారం అవుతున్నాయి.

ఈ బ్యూటీ ఇటీవల ఇండియన్‌–2 చిత్రం కోసం ఆత్మరక్షణ విద్యలో శిక్షణ పొందుతున్నట్లు తెలిపింది. అదే సమయంలో ఈ చిత్రంలో కమలహాసన్‌ ఇండియన్‌ పాత్ర ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయ్యాయి. దీంతో ఆయనకు జంటగా నటి కాజల్‌ అగర్వాల్‌ 85 ఏళ్ల వృద్ధురాలిగా నటిస్తోందనే ప్రచారం వైరల్‌ అవుతోంది. ఇలాంటి ప్రచారంపై ఇటీవల స్పందించిన కాజల్‌ ఇండియన్‌–2 చిత్రంలో తన పాత్ర గురించి ప్రచారం జరుగుతోందంది. అందులోని పాత్ర కోసం ఆత్మరక్షణ విద్య నేర్చుకుంటున్న విషయం నిజమేనని చెప్పింది. ఆ పాత్ర వయసు గురించి అడుగుతున్నారని, ఆయితే ఆ వివరాలను మాత్రం చెప్పనని పేర్కొంది. ఈ నెలలో తైవాన్‌లో జరగనున్న ఇండియన్‌ 2 చిత్ర షూటింగ్‌లో తాను పాల్గొనపోతున్నట్లు చెప్పింది.

మరో విషయం ఏమిటంటే సినిమాపై మక్కువ, వైవిధ్యభరిత కథలపై ఆసక్తితో నిర్మాతగా మారాలనుకున్నమాట నిజమేనని, అయితే తాను ఆశించిన కథలు అమరకపోవడంతో ఆ ఆలోచనను పక్కన పెట్టినట్లు చెప్పింది. అదేవిధంగా ప్రస్తుతం కథానాయకిగా విరామం లేకుండా నటిస్తున్నానని చెప్పింది. అలాంటి పరిస్థితుల్లో నిర్మాతగా మరి ఇంకా ఒత్తిడికి గురికావడం ఇష్టంలేదని అంది. తాను నటించిన ప్యారిస్‌ ప్యారిస్‌ చిత్రం బాగా వచ్చిందని, అయితే సెన్సార్‌ సమస్యలతో ఆటంకాలను ఎదుర్కొంటోందని చెప్పింది. అవన్నీ ఎదురొడ్డి త్వరలోనే చిత్రం తెరపైకి రావాలని కోరుకుంటున్నానని కాజల్‌ పేర్కొంది.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా