కాజల్‌ స్పెషల్‌?

12 Jun, 2019 04:28 IST|Sakshi

‘నేను పక్కా లోకల్‌ పక్కా లోకల్‌’ అంటూ ‘జనతా గ్యారేజ్‌’లో స్పెషల్‌ సాంగ్‌ చేశారు కాజల్‌ అగర్వాల్‌. ఈ పాట సూపర్‌ హిట్‌. కాజల్‌ స్టెప్స్‌కి ఫ్యాన్స్‌ విజిల్స్‌ మీద విజిల్స్‌ కొట్టారు. ఆ తర్వాత మళ్లీ ప్రత్యేక పాటలోనూ కనిపించలేదు కాజల్‌. లేటెస్ట్‌గా మరో స్పెషల్‌ సాంగ్‌లో కనిపిస్తారని తెలిసింది. త్రివిక్రమ్‌ దర్శకత్వంలో అల్లు అర్జున్‌ హీరోగా ఓ చిత్రం తెరకెక్కుతోంది. ఈ సినిమాలో ఓ ప్రత్యేక పాట ఉందట. ఆ పాటకు కాజల్‌ స్టెప్పేస్తే అదిరిపోతుందని చిత్రబృందం భావించిందట. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో పూజా హెగ్డే, నివేతా పేతురాజ్‌ కథానాయికలుగా కనిపిస్తారు. టబు, సుశాంత్‌ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. గీతా ఆర్ట్స్, హారికా హాసినీ క్రియేషన్స్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు