కాస్త అదనంగా ఇవ్వండి

19 Mar, 2020 03:56 IST|Sakshi
కాజల్‌ అగర్వాల్‌

‘‘గడిచిన 48గంటల్లో తన ఫస్ట్‌ ప్రయాణీకురాలిని నేనే అని ఓ క్యాబ్‌ డ్రైవర్‌ నన్ను చూసి కన్నీళ్లు పెట్టుకున్నారు. కనీసం ఈ రోజైనా కిరాణా సరుకులు ఇంటికి తీసుకురమ్మని తన భార్య చెప్పిందని ఆ క్యాబ్‌డ్రైవర్‌ నాతో చెప్పగానే ఎంతో బాధగా అనిపించింది’’ అన్నారు కాజల్‌ అగర్వాల్‌. కరోనా వైరస్‌ ప్రభావం అన్ని రంగాలపై వ్యతిరేక ప్రభావాన్ని చూపుతోంది. ముఖ్యంగా దినసరి కార్మికుల జీవన విధానం దెబ్బతింటోంది.

ఓ క్యాబ్‌డ్రైవర్‌ గురించి కాజల్‌ అరగ్వాల్‌ మాట్లాడుతూ– ‘‘దినసరి కార్మికుల జీవనశైలిని కరోనా మహమ్మారి తీవ్రంగా ఇబ్బందిపెడుతోంది. నాతో తన కష్టాలను చెప్పుకున్న ఆ క్యాబ్‌ డ్రైవర్‌కు నేను అదనంగా 500 రూపాయలు ఇచ్చాను. మనలో చాలామందికి కొంత మొత్తం పెద్ద సమస్య కాకపోవచ్చు. ఉపాధి కోల్పోయిన రోజువారీ కార్మికులకు మనం కాస్త ఎక్కువగానే డబ్బు ఇచ్చి ఈ కష్టకాలంలో వారికి అండగా ఉండటానికి ప్రయత్నిద్దాం’’ అని పేర్కొన్నారు.  

>
మరిన్ని వార్తలు