సందడే సందడి

2 Jun, 2018 01:57 IST|Sakshi
బెల్లంకొండ సాయిశ్రీనివాస్‌, కాజల్‌

సెట్‌లో ఫన్‌ రెట్టింపు అయ్యింది. అక్కడంతా సందడే సందడి. ఎందుకంటే అక్కడ ఉంది కథానాయిక కాజల్‌ మరి. ఆ మాత్రం హంగామా ఉంటుందిలేండి. ఇంతకీ ఫన్‌ అంతా ఎక్కడ? అంటే బెల్లంకొండ సాయిశ్రీనివాస్‌ హీరోగా నటిస్తున్న సినిమా లొకేషన్‌లో. శ్రీనివాస్‌ని దర్శకునిగా పరిచయం చేస్తూ బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ హీరోగా ఈ చిత్రాన్ని వంశధార క్రియేషన్స్‌ పతాకంపై నవీన్‌ సొంటినేని నిర్మిస్తున్నారు. చాగంటి శాంతయ్య సహ నిర్మాత. ఇందులో కాజల్‌ కథానాయిక. హైదరాబాద్‌లో జరుగుతున్న ఈ సినిమా షూట్‌లో కాజల్‌ పాల్గొం టున్నారు.

‘‘యాక్షన్‌ థ్రిల్లర్‌ నేపథ్యంలో సినిమా సాగుతుంది. ప్రస్తుతం శ్రీనివాస్, కాజల్‌లపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నాం. బాలీవుడ్‌ నటుడు నీల్‌ నితిన్‌ ముఖేష్, హర్షవర్ధన్‌ రాణే కీలక పాత్రల్లో కనిపించనున్నారు. చోటా కె. నాయుడు సినిమాటోగ్రఫీ. అబ్బూరి రవి మాటలు సినిమాకు స్పెషల్‌ ఎట్రాక్షన్‌. ఈ సినిమాకు చంద్రబోస్‌ సింగిల్‌ కార్డ్‌ రచయితగా పనిచేయడం చాలా హ్యాపీగా ఉంది. ఈ సినిమా హిందీ శాటిలైట్‌ రైట్స్‌ 9 కోట్ల 50లక్షలకు అమ్ముడు పోవడం విశేషం’’ అన్నారు చిత్రబృందం. ‘సత్యం’ రాజేశ్, కల్యాణి నటరాజన్, అపూర్వ తదితరులు నటిస్తున్న ఈ సినిమాకు సంగీతం: తమన్‌.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా