కాజల్‌.. సవాల్‌

30 Jul, 2019 07:52 IST|Sakshi

చెన్నై : హీరోయిన్ల ఛాలెంజ్‌లు అధికం అవుతున్నాయి. మొన్న నటి సమంత ఒక్క బక్కెట్‌ నీరు అంటూ ఛాలెంజ్‌ విసిరింది. తాజాగా నటి కాజల్‌అగర్వాల్‌ కూడా సవాల్‌ అంటోంది. అయితే ఈ అమ్మడి ఛాలెంజ్‌ చాలా బరువైనదే. దాదాపు ఒకటిన్నర దశాబ్దం నట జీవిత మైలురాయి టచ్‌ చేయడానికి చేరువలో ఉన్న నటి కాజల్‌ అగర్వాల్‌. అదే విధంగా అర్ధ సెంచరీ చిత్రాల మైలురాయిని అవలీలగా దాటేసింది. అయినా ఈ అమ్మడికి సినీ మోహం ఏ మాత్రం తీరలేదు. స్టిల్‌ నాటౌట్‌ క్రేజీ హీరోయిన్‌గా బరిలో ఉంది.

బహు భాషా నటిగానూ రాణిస్తోంది. ఇందుకు కావలసినంత అందాన్ని మెరుగు పరుచుకునే ప్రయత్నాలూ చేస్తోంది. అందుకు కసరత్తులు చాలా అవసరం. ఈ విషయంలో కాజల్‌ అగర్వాల్‌ మరింత డోస్‌ పెంచేసింది. ఇప్పటి వరకూ సాధారణ ఎక్సర్‌సైజ్‌లతో సరిపెట్టుకుంటూ వెయిట్‌ లిప్ట్‌ జోలికి పోనీ ఈ బ్యూటీ ఇటీవల ఆ ప్రయత్నాలు మొదలెట్టేసింది. వెయిట్‌లిప్ట్‌ల్లో హీరోయిన్లు పోటీ పడటమే ఇందుకు కారణంగా తెలుస్తోంది.

కాగా కాజల్‌అగర్వాల్‌ తొలి ప్రయత్నంలోనే ఏకంగా 70 కిలోల బరువును చేతులతో లేపేసే ప్రయత్నం చేసింది. తన శిక్షకుడి పర్యవేక్షణలో అంత వెయిట్‌ లిప్ట్‌ చేసిన కాజల్‌ అమ్మో అంటూ ఒక్క సారిగా కింద చతికిల పడిందట. అయితే ఇది ట్రైలరేననీ, మెయిన్‌ పిక్చర్‌ ముందు ముందు చూపిస్తాననీ సవాల్‌ విసిరింది. అయితే ఈ సవాల్‌ను తను విసిరింది అభిమానులకా? లేక ఇతర హీరోయిన్లకా అనే చర్చ సినీ వర్గాల్లో స్టార్ట్‌ అయ్యింది. అయితే చందమామ వెయిట్‌ లిప్ట్‌ కసరత్తుల దృశ్యాలు మాత్రం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్నాయి. కమలహాసన్‌కు జంటగా ఇండియన్‌–2 చిత్రంలో నటించడానికి ఈ ముద్దుగుమ్మ రెడీ అవుతోంది. ఆయన సరసన మరింత నాజూగ్గా కనిపించాలనే ఈ వెయిట్‌లిప్ట్‌ కసరత్తులు చేస్తున్నట్లు సమాచారం. ఏదేమైనా కాజల్‌ కసరత్తుల వ్యవహారం ఇప్పుడు ట్రెండింగ్‌ అవుతోంది.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

అఖిల్‌ సరసన?

తగ్గుతూ.. పెరుగుతూ...

సంపూ రికార్డ్‌

వాలి స్ఫూర్తితో...

కాలేజీకి చేసినదే సినిమాకి చేశాను

బంగారు గనుల్లోకి...

తిరున్నాళ్ల సందడి!

పిక్చర్‌ పర్ఫెక్ట్‌

కరెక్ట్‌ టైమ్‌లో చెప్పిన కథ ఇది

చికుబుకు రైలే...

బిగ్‌బాస్‌.. నామినేషన్‌లో ఉన్నది ఎవరంటే?

‘గీతాంజలి’లో ఆ సీన్‌ తీసేస్తారనుకున్నా : నాగ్‌

‘మా మానాన మమ్మల్ని వదిలేయండి’

ఇషాన్‌తో జాన్వీకపూర్‌ డేటింగ్‌..!

ఏడు దేశాల్లో సినిమా షూటింగ్‌

సాహో నుంచి ‘ఏ చోట నువ్వున్నా..’

పెన్సిల్‌, ప్రియ గుడ్‌బై చెప్పేశారు

అదిరిపోయిన అధీరా లుక్‌..!

సూపర్‌స్టార్‌.. రియల్‌ బిజినెస్‌మేన్‌

అతనిలో నేను ఆమెలా ఉంటూ..

‘బిగ్‌ బాస్‌ షోలో ఆయన చేసింది బాగోలేదు!’

‘ఇది ఏమైనా మీ ఇంటి హాలా, పెరడా’

కొత్త ఆలోచ‌న‌ల‌కు చిరునామా ‘తూనీగ’

‘బిగ్‌బాస్‌’పై హేమ సంచలన వ్యాఖ్యలు

నా జాక్‌పాట్‌ సూర్యనే!

‘నా కథ విని సాయిపల్లవి ఆశ్చర్యపోయింది’

నోరు జారి అడ్డంగా బుక్కైన రష్మీక

ఆ ముద్ర  చెరిగిపోయింది

తలైవి కంగనా

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

కాజల్‌.. సవాల్‌

అఖిల్‌ సరసన?

తగ్గుతూ.. పెరుగుతూ...

సంపూ రికార్డ్‌

వాలి స్ఫూర్తితో...

కాలేజీకి చేసినదే సినిమాకి చేశాను