నేనలా చేసింది మీరు చూశారా?: హీరోయిన్‌

8 Jul, 2017 17:39 IST|Sakshi
నేనలా చేసింది మీరు చూశారా?: హీరోయిన్‌

చెన్నై: నేనలా చేసింది మీరు చూశారా? అంటూ మీడియాపై మండిపడుతోంది నటి కాజల్‌ అగర్వాల్‌. ఇంతకీ ఈ అమ్మడి ఆగ్రహానికి కారణం ఏమటనేగా మీ ప్రశ్న. కాజల్‌ అందగత్తే నోడౌట్‌ ఎబౌటిట్‌. నటనలో పరిణితి చెందిన నటి కూడా. అందుకే అగ్రనాయికల్లో ఒకరిగా రాణిస్తోంది. మధ్యలో కాస్ల ఒడిదుడుకులను ఎదుర్కొన్నా, దశాబ్దం కాలంగా కథానాయకిగా తన స్థానాన్ని పదిలపరచుకుంటూ వస్తోంది. ఇటీవల తెలుగు చిత్రం ఖైధీనంబర్‌ 150లో మెగాస్టార్‌ చిరంజీవితో అమ్మడు లెట్స్‌ డూ కుమ్ముడు లాంటి ఆటలతో ఇరగదీసిని కాజల్‌ తాజాగా తమిళంలో విజయ్‌కు జంటగా మెర్సల్, అజిత్‌తో వివేగం చిత్రాలలో నటిస్తూ బిజీగా ఉంది.

తెలుగులోనూ తన 50వ చిత్రం నేనేరాజా నేనే మంత్రి చిత్రాన్ని పూర్తి చేసే పనిలో ఉంది. అంతా బాగానే ఉంది.తాజాగా కాజల్‌ అగర్వాల్‌ తన అందాన్ని మరింత మెరుగుపరుకోవడానికి సర్జరీ చేయించుకుందనే ప్రచారం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఈ విషయమే కాజల్‌ కోపాన్ని హైపీచ్‌కు తీసుకెళ్లింది. అంతే తాను శస్త్ర చికిత్స చేయించుకోవడం మీరు చూశారా? అంటూ ఆవేశపడిపోయింది.

తను అందాన్ని మెరుగు పరచుకోవడం కోసం సర్జరీ చేయించుకున్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని కాజల్‌ కొట్టిపారేసింది. తనకలాంటి అవసరం లేదనీ, తన అందం సహజసిద్ధమేననీ చెప్పుకొచ్చింది. తాను డైట్‌లో ఉంటానని, నిత్యం కసరత్తులు కూడా చేస్తాననీ, ఇదే తన సౌందర్య రహస్యం అని కాజల్‌ చెప్పింది.