భావోద్వేగ ప్రేమకథ

12 May, 2019 02:30 IST|Sakshi
కాజల్, శివ కందుకూరి, మేఘా ఆకాష్‌

హీరోయిన్‌ కాజల్‌ అగర్వాల్‌ నిర్మాతగా మారారు. ఆమె సమర్పణలో రూపొందుతున్న చిత్రం ‘మను చరిత్ర’. ‘ఫాలింగ్‌ ఇన్‌ లవ్‌ ఈజ్‌ ఏ పెయిన్‌ఫుల్‌ జాయ్‌’ అన్నది ఉపశీర్షిక. నిర్మాత రాజ్‌ కందుకూరి తనయుడు శివ కందుకూరి హీరోగా, ‘లై’ ఫేమ్‌ మేఘా ఆకాష్‌ హీరోయిన్‌గా నటిస్తున్నారు. భరత్‌ కుమార్‌ పి. దర్శకత్వం వహిస్తున్నారు. ఆపిల్‌ ట్రీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై ఎన్‌.శ్రీనివాస్‌ రెడ్డి, కాజల్‌ అగర్వాల్‌ మేనేజర్‌ పి.రాన్సన్‌ జోసెఫ్‌ నిర్మిస్తున్న ఈ చిత్రం హైదరాబాద్‌లో ప్రారంభమైంది.

ముహూర్తపు సన్నివేశానికి నిర్మాత సి.కల్యాణ్‌ కెమెరా స్విచ్చాన్‌ చేయగా, కాజల్‌ క్లాప్‌ ఇచ్చారు. డైరెక్టర్‌ అజయ్‌ భూపతి గౌరవ దర్శకత్వం వహించారు. డైరెక్టర్‌ సుధీర్‌ వర్మ, నిర్మాత సాహు గారపాటి స్క్రిప్ట్‌ను అందించారు. ‘‘ఎమోషనల్‌ ఇన్‌టెన్స్‌ లవ్‌స్టోరీ ఇది. ఈ నెలలోనే రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభం అవుతుంది’’ అని చిత్రబృందం పేర్కొంది. నిర్మాతలు అనిల్‌ సుంకర, రాజ్‌ కందుకూరి, అనిల్‌ కన్నెగంటి, ‘మధుర’ శ్రీధర్, కృష్ణ చైతన్య, కొండా విజయ్‌కుమార్, రాధాకృష్ణ, శివ నిర్వాణ పాల్గొన్నారు. ఈ చిత్రానికి సంగీతం: గోపీ సుందర్, కెమెరా: రాహుల్‌ శ్రీవాత్సÐŒ .

మరిన్ని వార్తలు