కూతురికి ప్రేమతో...

2 Nov, 2018 01:45 IST|Sakshi
కూతురు నిసా, కొడుకు యుగ్‌తో అజయ్, కాజోల్‌

పిల్లలకు గిఫ్ట్‌లు ఇచ్చి సర్‌ప్రైజ్‌ చేస్తుంటారు తల్లిదండ్రులు. సందర్భం ఉన్నా.. లేకున్నా... పిల్లలకు బహుమానాలు ఇవ్వడంలో పేరెంట్స్‌ ఆనందం పొందుతుంటారు. తాజాగా బాలీవుడ్‌ జంట అజయ్‌ దేవగన్, కాజోల్‌ కూడా తమ గారాల పట్టి నీసాకు కాస్ట్‌లీ గిఫ్ట్‌ ఇచ్చి ఎంతో సర్‌ప్రైజ్‌ చేశారు. ఆ గిఫ్ట్‌ అలాంటి ఇలాంటిది కాదు.. సింగపూర్‌లో ఖరీదైన లగ్జరీ ఫ్లాట్‌ కావడం విశేషం. ఉన్నత చదువుల కోసం నిసా సింగపూర్‌లో ఉంటున్నారు. యునైటెడ్‌ వరల్డ్‌ కాలేజ్‌లో చదువుతున్న ఆమె ప్రస్తుతానికి   కళాశాల హాస్టల్‌లోనే ఉంటున్నారు. అయితే తమ కూతురు హాస్టల్‌లో కాకుండా ఇండిపెండెంట్‌గా, సొంత ఫ్లాట్‌లో ఉండాలన్న ఉద్దేశంతో సింగపూర్‌లోని కాస్ట్‌లీ ఏరియా ఆర్చర్డ్‌ రోడ్‌లో ఓ లగ్జరీ ఫ్లాట్‌ను కొనుగోలు చేసి, కూతురికి గిఫ్ట్‌గా ఇచ్చారట అజయ్‌–కాజోల్‌. వచ్చే ఏడాది జనవరిలో నిసా గృహప్రవేశం చేయనున్నారు.
∙ కూతురు నిసా, కొడుకు యుగ్‌తో అజయ్, కాజోల్‌

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

జయలలిత స్ఫూర్తితోనే..!

మంచి చిత్రాలను ప్రభుత్వం ప్రోత్సహించాలి

సైలెంట్‌గా ఉన్నారు

నెక్ట్స్‌ ఏంటి?

వాళ్ల మైండ్‌సెట్‌ మారుతుందనుకుంటున్నా

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

జయలలిత స్ఫూర్తితోనే..!

మంచి చిత్రాలను ప్రభుత్వం ప్రోత్సహించాలి

సైలెంట్‌గా ఉన్నారు

నెక్ట్స్‌ ఏంటి?

వాళ్ల మైండ్‌సెట్‌ మారుతుందనుకుంటున్నా

ప్రేమ సందేశాలు