అదే గొప్ప ఆస్తి: కాజోల్‌

21 Jan, 2020 15:03 IST|Sakshi

బాలీవుడ్‌ సీనియర్‌ నటి కాజోల్‌ దేవగన్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌లో 20 ఏళ్ల ఛాలెంజ్‌ పేరిట ఓ ఫొటోను షేర్‌ చేశారు. 20 ఏళ్ల క్రితం నాటి ఫొటోతో పాటు, తన తాజా చిత్రాన్ని గ్రాఫిక్స్ ఇంటర్ చేంజ్ ఫార్మాట్‌లో ఇన్‌స్టాలో షేర్‌ చేశారు ఈ 45 ఏళ్ల నటి. సోమవారం షేర్‌ చేసిన ఈ పోస్టులో ఒకటి 1999 నాటిది అయితే మరొకటి గతేడాదికి చెందినది. ఒకే రకం స్టైల్‌లో పోజ్‌లో ఉన్న ఈ ఫొటోలకు..  "మిమ్మల్ని ఆశ్చర్యపరిచే విషయమే మీ గొప్ప ఆస్తి’ అనే క్యాప్షన్‌ను కాజోల​ జతచేశారు. ఇక ఆమె పోస్టుకు ఫిదా అయిన అభిమానులు.. ‘అప్పుడు, ఇప్పుడు ఒకేలా ఉన్నారు.. మీ అందం ఇప్పటికీ ఏమాత్రం చెక్కు చెదరలేదు’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.(తరచూ గర్భస్రావం.. వేదనకు గురయ్యాం: నటి)

Whatever makes you weird is probably your greatest asset! - Albert Einstein #20YearChallenge #WeirdThenWeirdNow

A post shared by Kajol Devgan (@kajol) on

ఇక కాజోల్‌ దాదాపు 10 ఏళ్ల తర్వాత తన భర్త అజయ్‌ దేవగన్‌తో కలిసి నటించిన చిత్రం ‘తాన్హాజీ’. హిస్టారికల్‌ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాలో కాజోల్‌, అజయ్‌ దేవగన్‌, సైఫ్‌ అలీఖాన్‌లు కీలక పాత్రలో నటించారు. ఈ ఏడాది సంక్రాంతికి విడుదలైన ఈ చిత్రం బాక్స్‌ఫీస్‌ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

దూసుకుపోతున్న రౌడీ!

సామజవరగమన పాటకు కేటీఆర్‌ ఫిదా

ఆర్‌ఆర్‌ఆర్‌: జక్కన్నతో బాలీవుడ్‌ స్టార్‌ హీరో

రౌడీ క్రేజ్‌: యూట్యూబ్‌లో ఒక్క రోజులోనే..

ఓవర్సీస్‌లో అల వసూళ్ల హోరు..

సినిమా

అదే గొప్ప ఆస్తి: కాజోల్‌

సామజవరగమన పాటకు కేటీఆర్‌ ఫిదా

ఆర్‌ఆర్‌ఆర్‌: జక్కన్నతో బాలీవుడ్‌ స్టార్‌ హీరో

రౌడీ క్రేజ్‌: యూట్యూబ్‌లో ఒక్క రోజులోనే..

తిరుగులేని తాన్హాజీ, మరో రికార్డు దిశగా

ఓవర్సీస్‌లో అల వసూళ్ల హోరు..