సూర్యుడొచ్చాడా... అయితే గుడ్‌నైట్‌!

5 Oct, 2017 01:04 IST|Sakshi

సూర్యుడు ఉదయించగానే ఎవరైనా ‘గుడ్‌ మార్నింగ్‌’ చెబుతారు. కానీ, హ్యూమా ఖురేషీ మాత్రం ‘గుడ్‌ నైట్‌’ అంటున్నారు. పదీ పదిహేను రోజులుగా ఇదే వరస. మేడమ్‌ తేడానేమో? కొంచెం తిక్క ఉందేమో అనుకుంటున్నారా? ఆ తిక్కకో లెక్కుంది. ఇంతకీ ఆ లెక్క ఏంటంటే, దాదాపు రెండు వారాలుగా ఆమె నైట్‌ షూట్స్‌ చేస్తున్నారు. రజనీకాంత్‌ హీరోగా రంజిత్‌.పా దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘కాలా’. ఇందులో హ్యూమా కథానాయిక నటిస్తోన్న విషయం తెలిసిందే.

ప్రస్తుతం  చెన్నైలో షూటింగ్‌ జరుగుతోంది. నైట్‌ సీన్స్‌ తీస్తున్నారు. రాత్రంతా షూటింగ్‌ చేసి, ఉదయం ప్యాకప్‌ చెబుతున్నారు. అందుకే, నైట్‌ మేల్కొని, డేలో ‘గుడ్‌ నైట్‌’ చెప్పి నిద్రపోతున్నారు. ‘‘మా కెప్టెన్‌ భీమ్‌జీ (పా. రంజీత్‌)తో పాటు అందరం నైట్‌ షెడ్యూల్స్‌లో చాలా కష్టపడుతున్నాం. మిడ్‌నైట్‌ షూట్స్‌. ప్రతి రోజూ సూర్యోదయం తర్వాతే షూటింగ్‌కి ప్యాకప్‌ చెబుతున్నారు. సో.. నా స్లీప్‌ టైమ్‌ అంటే డే టైమే’’ అని హ్యూమా ఖురేషీ పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు