ఆలోచింపజేసే కలియుగ

1 Dec, 2019 05:55 IST|Sakshi
సూర్య, సత్యదేవ్‌

రాజ్, స్వాతీ దీక్షిత్‌ జంటగా తిరుపతి దర్శకత్వంలో నటుడు సూర్య (పింగ్‌ పాంగ్‌) నిర్మించిన చిత్రం ‘కలియుగ’. ఈ నెల 6న విడుదల కానున్న ఈ సినిమా ప్రీ–రిలీజ్‌ వేడుక హైదరాబాద్‌లో జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న నటుడు సత్యదేవ్‌ మాట్లాడుతూ– ‘‘సమాజంలో జరుగుతున్న సంఘటనల ఆధారంగా ఈ సినిమాను తీసిన సూర్యకు అభినందనలు. సినిమా ప్రేక్షకులకు నచ్చుతుందని అనుకుంటున్నాను’’ అన్నారు. ‘‘దర్శకుడు తిరుపతి సినిమాను బాగా తెరకెక్కించారు.

భవిష్యత్‌లో  సూర్య ఇలాంటి సినిమాలను ఎన్నో నిర్మించాలని కోరుకుంటున్నాను’’ అన్నారు రాజ్‌. ‘‘రెగ్యులర్‌ కథలను పక్కనపెట్టి సమాజంలో జరుగుతున్న సంఘటనల ఆధారంగా స్క్రిప్ట్‌ రాసుకున్నాను. చిత్రీకరణ సమయంలో సూర్య సపోర్ట్‌ మరువలేనిది. మా చిత్రం పాటను విడుదల చేసిన పవన్‌కల్యాణ్‌గారికి థ్యాంక్స్‌’’ అన్నారు తిరుపతి. ‘‘లవ్, యాక్షన్, సెంటిమెంట్‌ అన్నీ ఉన్న ఈ చిత్రం ప్రేక్షకులను ఆలోచింపజేస్తుంది. సునీల్‌ కశ్యప్‌ మంచి సంగీతం ఇచ్చారు’’ అన్నారు సూర్య. ‘‘సూర్య మంచి సినిమా తీశాడు’’ అన్నారు తాగుబోతు రామేష్‌.

మరిన్ని వార్తలు