ఆస్తులు అమ్మి ఈ సినిమా తీశా

6 Dec, 2019 01:03 IST|Sakshi

నటుడు సూర్య (పింగ్‌ పాంగ్‌) హీరోగా నటించి, నిర్మించిన సినిమా ‘కలియుగ’. రాజ్, స్వాతి దీక్షిత్‌ జంటగా నటించారు. తిరుపతి దర్శకత్వంలో సూర్య నిర్మించిన ఈ సినిమా నేడు రిలీజవుతోంది. సూర్య మాట్లాడుతూ– ‘‘18ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉన్నా. ఇప్పటి వరకూ నేను పడిన కష్టాన్నంతా ‘కలియుగ’ సినిమాకి ప్రాణంగా పెట్టా. ప్రస్తుత సమాజంలో జరుగుతున్న సంఘటనలకు మా సినిమా అద్దం పడుతుంది. ఈ కథని కొందరు నిర్మాతలకి చెప్పినా వారు ముందుకు రాలేదు. ఓ మంచి సినిమాని ప్రేక్షకులకు అందించాలనే ఉద్దేశంతో నా తల్లిదండ్రుల సహకారంతో ఆస్తులు అమ్మి మరీ ఈ సినిమా నిర్మించా’’ అన్నారు.

మరిన్ని వార్తలు