ఏం సెప్తిరి... ఏం సెప్తిరి!

11 May, 2019 00:32 IST|Sakshi

హీరో రాజశేఖర్‌గారి మేనరిజమ్స్‌ని ఇప్పటివరకూ చాలామంది ఇమిటేట్‌ చేశారు. అయితే తన మేనరిజమ్స్‌ని రాజశేఖర్‌గారే ఇమిటేట్‌ చేస్తే ఎలా ఉంటుంది? ‘ఏం సెప్తిరి... ఏం సెప్తిరి!’ డైలాగ్‌ ఆయన చెప్తే ఎలా ఉంటుంది? ‘కల్కి’ కమర్షియల్‌ ట్రైలర్‌ చూస్తే మీకే తెలుస్తుంది. రాజశేఖర్‌ హీరోగా ‘అ!’ ఫేమ్‌ ప్రశాంత్‌ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘కల్కి’. శివానీ–శివాత్మిక సమర్పణలో హ్యాపీ మూవీస్‌ పతాకంపై సి. కళ్యాణ్‌ నిర్మించిన ఈ సినిమాని ఈనెల 31న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

ఈ చిత్రం కమర్షియల్‌ ట్రైలర్‌ని హీరో నాని విడుదల చేశారు. ఈ ట్రైలర్‌ని ‘మహర్షి’ సినిమా ఆడుతున్న థియేటర్లలో ప్రదర్శిస్తున్నారు. రాజశేఖర్‌ మాట్లాడుతూ– ‘‘కల్కి’ కమర్షియల్‌ ట్రైలర్‌ చాలా బావుందని, చాలా ఎంజాయ్‌ చేశామంటూ చాలా మంది ఫోన్లు చేశారు.. మెసేజ్‌లు పెట్టారు. సోషల్‌ మీడియాలో కూడా సూపర్‌ రెస్పాన్స్‌ వచ్చింది. ప్రేక్షకుల స్పందన చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. ఇంత రెస్పాన్స్‌ వస్తుందని ఊహించలేదు’’ అన్నారు.

‘‘కల్కి’ ట్రైలర్‌కు వస్తున్న స్పందన చూస్తే చాలా సంతోషంగా ఉంది. రాజశేఖర్‌గారు నేను అడిగినది కాదనకుండా చేశారు. ఆయన  మేనరిజమ్స్‌ ఆయనే ఇమిటేట్‌ చేయడంతో ప్రేక్షకులు థ్రిల్‌ అయ్యారు. సి. కళ్యాణ్‌గారు ఖర్చుకు వెనకాడకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు’’ అన్నారు ప్రశాంత్‌ వర్మ. ‘‘రాజశేఖర్‌ డెడికేషన్, ప్రశాంత్‌ వర్మ హార్డ్‌ వర్క్‌తో సినిమా బాగా వచ్చింది’’ అని సి. కళ్యాణ్‌ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: దాశరథి శివేంద్ర, సంగీతం: శ్రవణ్‌ భరద్వాజ్, లైన్‌ ప్రొడ్యూసర్‌: వెంకట్‌ కుమార్‌ జెట్టి.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు