సెట్లోకి సూపర్‌ మచ్చి

23 Jun, 2020 00:57 IST|Sakshi
కల్యాణ్‌ దేవ్, రచితా రామ్‌

‘విజేత’ సినిమాలో తన నటనతో ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న కల్యాణ్‌ దేవ్‌ (చిరంజీవి చిన్నల్లుడు) హీరోగా నటిస్తున్న ద్వితీయ చిత్రం ‘సూపర్‌ మచ్చి’. పులి వాసు దర్శకుడు. రచితా రామ్‌ కథానాయికగా నటిస్తున్నారు. రిజ్వాన్, ఖుషి నిర్మిస్తున్న ఈ చిత్రం చివరి షెడ్యూల్‌ హైదరాబాద్‌లో ప్రారంభమైంది. రిజ్వాన్, ఖుషి మాట్లాడుతూ– ‘‘లవ్‌ స్టోరీ మిక్స్‌ చేసిన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ చిత్రమిది.

అటు మాస్‌ ఇటు కుటుంబ ప్రేక్షకులకి కల్యాణ్‌ దేవ్‌ పాత్ర నచ్చుతుంది. తమన్‌ మ్యూజిక్‌ హైలైట్‌గా నిలుస్తుంది. ‘సూపర్‌ మచ్చి’ టైటిల్‌ సాంగ్‌ బాగా వచ్చింది. షూటింగ్‌లకు ప్రభుత్వం అనుమతించడంతో మా షూటింగ్‌ మొదలుపెట్టాం. కల్యాణ్‌దేవ్, రచితా రామ్‌తో పాటు అజయ్‌పై కొన్ని ప్రధాన సన్నివేశాలు చిత్రీకరిస్తున్నాం. ఈ షెడ్యూల్‌తో సినిమా పూర్తవుతుంది. ఈ చిత్రానికి కెమెరా: శ్యామ్‌ కె. నాయుడు, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: మనోజ్‌ కుమార్‌ మావిళ్ల.

మరిన్ని వార్తలు