బిజీ బిజీ

22 Feb, 2019 01:09 IST|Sakshi

‘హలో’తో తెలుగు చిత్రపరిశ్రమకు హాయ్‌ చెప్పారు కల్యాణీ ప్రియదర్శన్‌. ప్రస్తుతం ఆమె తెలుగు, తమిళ భాషల్లో సినిమాలు చేస్తూ బిజీ అయిపోయారు. ఈ ఏడాది కల్యాణి రెండుభాషల్లో నటించిన రెండేసి సినిమాలు రిలీజ్‌ కాబోతున్నాయి. ప్రస్తుతం తెలుగులో ఆమె శర్వానంద్‌ సరసన సుధీర్‌ వర్మ  సినిమాలో, సాయిధరమ్‌ తేజ్‌తో ‘చిత్రలహరి’ సినిమాలతో బిజీగా ఉన్నారు. తమిళంలో దుల్కర్‌ సల్మాన్‌తో ‘వాన్‌’ చిత్రం చేస్తున్నారు. ఆ సినిమా రిలీజ్‌ కాకముందే మరో సినిమా అంగీకరించి జోరు పెంచారు కల్యాణీ ప్రియదర్శన్‌.

‘ఇరంబుదురై’ (తెలుగులో ‘అభిమన్యుడు’) చిత్రాన్ని రూపొందించిన పీఎస్‌ మిత్రన్‌ దర్శకత్వంలో శివ కార్తికేయన్‌ హీరోగా ఓ సినిమా తెరకెక్కనున్నంది. ఇందులో హీరోయిన్‌గా కల్యాణీ ప్రియదర్శన్‌ నటించనున్నారు. ఈ విషయాన్ని మంగళవారం అధికారికంగా వెల్లడించారు. తెలుగులో రెండు, తమిళంలో రెండు సినిమాలతో పాటు మలయాళంలో ఆమె తండ్రి ప్రియదర్శన్‌ తెరకెక్కిస్తున్న ‘మరక్కార్‌’ చిత్రంలో ఓ కీలక పాత్ర పోషించారు. ఇందులో మోహన్‌లాల్‌ హీరో. కాగా, కళ్యాణి క్యారెక్టర్‌ షూట్‌ పూర్తయింది. 2020లో ఈ చిత్రం విడుదల కానుంది. 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా