హీరోకు టైమ్‌ ఫిక్స్‌

28 Jul, 2019 10:23 IST|Sakshi

‘హీరో’కు టైమ్‌ ఫిక్స్‌ చేశారు. నటుడు శివకార్తికేయన్‌కు అర్జెంట్‌గా ఒక హిట్‌ అవసరం. ఆయన ఇటీవల నటించిన చిత్రాలేవీ ఆశించిన విజయాలను అందుకోలేదు. ముఖ్యంగా ఇటీవల నయనతారతో కలిసి నటించిన మిస్టర్‌ లోకల్‌ చాలా నిరాశ పరిచింది. ఎంత స్టార్‌ వ్యాల్యూ ఉన్నా కథలో విషయం లేకపోతే ప్రేక్షకులు తిరష్కరిస్తారనడానికి ఈ చిత్రం ఒక నిదర్శనం. అయితే శివకార్తికేయన్‌ నిర్మాతగా హ్యాపీగానే ఉన్నాడు.

ఆయన కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రాలలో హీరో ఒకటి. ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. కారణం విశాల్‌ కథానాయకుడిగా ఇరుంబుతిరై వంటి సంచలన విజయాన్ని సాధించిన చిత్ర దర్శకుడు మిత్రన్‌ తెరకెక్కిస్తున్న చిత్రం హీరో. నటుడు అర్జున్‌ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రం ద్వారా నటి కల్యాణి ప్రియదర్శన్‌ కథానాయకిగా కోలీవుడ్‌కు పరిచయం అవుతున్నారు.

ఈ సినిమా తరువాత దుల్కర్‌సల్మాన్‌తో వాన్, శింబు సరసన మానాడు చిత్రాల్లో నటించడానికి ఓకె చెప్పారు కల్యాణీ. కాగా హీరో చిత్రంలో మరో నాయకిగా ఇవనా నటిస్తున్నారు. బాలీవుడ్‌ నటుడు అభయ్‌ డియోల్, రోబోశంకర్, ప్రేమ్‌కుమార్‌ ముఖ్య పాత్రలను పోషిస్తున్న ఈ చిత్రాన్ని కేజీఆర్‌ స్టూడియోస్‌ కోట్టపాటి జే.రాజేశ్‌ నిర్మిస్తున్నారు. యువన్‌ శంకర్‌రాజా సంగీతాన్ని అందిస్తున్న ఈ సినిమా చిత్రకరణ దశలో ఉంది.

తాజాగా చిత్ర నిర్మాతలు హీరో చిత్ర విడుదల తేదీని వెల్లడించారు. చిత్రాన్ని డిసెంబర్‌ 20న విడుదల చేయనున్నట్లు అధికారికంగా వెల్లడించారు. హీరో చిత్రం రాజకీయ నేపథ్యంలో సాగే యాక్షన్‌ థ్రిల్లర్‌ కథా చిత్రంగా ఉంటుందని యూనిట్‌ వర్గాలు తెలిపారు. దీంతో నటుడు శివకార్తికేయన్‌ హీరో చిత్రంపై చాలా నమ్మకం పెట్టుకున్నారు. దీని తరువాత పాండిరాజ్‌ దర్శకత్వంలో నటిస్తున్నారు. ఇందులో అనుఇమాన్యుల్‌ హీరోయిన్‌గా నటిస్తున్నారు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

నికీషా లక్ష్యం ఏంటో తెలుసా?

ఓ బేబీ షాకిచ్చింది!

‘అక్షరా’లా అది నా ఆరో ప్రాణం..

హీరో సూరి

డూప్‌ లేకుండానే...

తొలి అడుగు పూర్తి

నా కామ్రేడ్స్‌ అందరికీ థ్యాంక్స్‌

హాసన్‌ని కాదు శ్రుతీని!

షుగర్‌ కోసం సాహసాలు!

చలన చిత్ర వాణిజ్య మండలి అధ్యక్షునిగా నారాయణ్‌దాస్‌

గుణ అందరికీ కనెక్ట్‌ అవుతాడు

చయ్య చయ్య.. చిత్రీకరణలో కష్టాలయ్యా

పంద్రాగస్టుకి ఫస్ట్‌ లుక్‌

దైవ రహస్యం

సరికొత్త కథతో...

ఇల్లు ఖాళీ చేశారు

మంచి నటుడు అనిపించుకోవాలనుంది

త్వరలోనే డబుల్‌ ఇస్మార్ట్‌ స్టార్ట్‌

భారీ అయినా సారీ!

మా ఇద్దరికీ ఈ జాక్‌పాట్‌ స్పెషల్‌

పోలీస్‌ వ్యవసాయం

ఢిల్లీ టు స్విట్జర్లాండ్‌

బిగ్‌బాస్‌.. హేమ అవుట్‌!

సంపూ ట్వీట్‌.. నవ్వులే నవ్వులు

బిగ్‌బాస్‌.. జాఫర్‌, పునర్నవి సేఫ్‌!

ఇది ‘మహర్షి’ కలిపిన బంధం

ప్రేమలో పడ్డ ‘చిన్నారి’ జగదీశ్‌!

దిల్ రాజు ప్యానల్‌పై సీ కల్యాణ్ ప్యానల్‌ ఘనవిజయం

‘ఎక్కడ మాట్లాడినా ఏడుపొచ్చేస్తుం‍ది’

జ్యోతిక, రేవతిల జాక్‌పాట్‌

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

హీరోకు టైమ్‌ ఫిక్స్‌

నికీషా లక్ష్యం ఏంటో తెలుసా?

‘అక్షరా’లా అది నా ఆరో ప్రాణం..

హీరో సూరి

డూప్‌ లేకుండానే...

తొలి అడుగు పూర్తి