ఆయన దర్శకత్వంలో నటించాలనుంది!

21 Dec, 2019 10:45 IST|Sakshi

సినిమా: నటుడు శివకార్తికేయన్‌ దర్శకత్వంలో నటించాలని కోరుకుంటున్నట్లు నటి కల్యాణి ప్రియదర్శన్‌ పేర్కొంది. ఈ చిన్నదాని గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం ఉండదనుకుంటా. ప్రముఖ దర్శకుడు ప్రియదర్శన్, నటి లిజీల కూతురే ఈ బ్యూటీ. హలో చిత్రం ద్వారా టాలీవుడ్‌లో హీరోయిన్‌గా పరిచయమైన భామ ఇప్పుడు కోలీవుడ్‌లో హీరో చిత్రంతో ఎంట్రీ ఇచ్చింది. శివకార్తికేయన్‌ కథానాయకుడిగా నటించిన ఈ చిత్రాన్ని పీఎస్‌.మిత్రన్‌ దర్శకత్వంలో కోటప్పాటి జే.రాజేశ్‌ తన కేజేఆర్‌ స్టూడియోస్‌ పతాకంపై నిర్మించారు. నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ చిత్రం శుక్రవారం తెరపైకి వచ్చింది. ఈ సందర్భంగా ఇందులో హీరోయిన్‌గా నటించిన నటి కల్యాణి తన అనుభవాలను పంచుకుంటూ హీరో చిత్రంలో తాను మీరా అనే పాత్రలో నటించానని చెప్పింది. మీరా చాలా పరిణితి చెందిన యువతి అని పేర్కొంది. ఏం మాట్లాడినా ఏ పని చేసినా పలుమార్లు ఆలోచించి చేసే యువతి మీరా అని చెప్పింది.

ఈ పాత్ర తన నిజజీవితానికి పూర్తిగా భిన్నమైందని చెప్పింది. తాను ఏదైనా అనుకుంటే మరో ఆలోచన లేకుండా చేసేస్తానని పేర్కొంది. హీరో చిత్రం ప్రధానంగా విద్యపై చర్చించే ఇతివృత్తంతో కూడిందని చెప్పింది. తాను ఇండియాలోనూ, విదేశాల్లోనూ చదివిన అమ్మాయినని,ఆ విధంగా ఈ రెండు విధానాల విద్య గురించి తెలిసిన యువతినని అంది. ఈ చిత్రంలో మన దేశంలో విద్య గురించేదిగా ఉంటుందని చెప్పింది. అంతే కాకుండా మన దేశంలో విద్యావిధానం గురించి విద్యార్థులు చర్చించుకునే విధంగా ఈ చిత్ర కత ఉంటుందని తెలిపింది. దర్శకుడు పీఎస్‌.మిత్రన్‌ తెరపై మాయాజాలం చూపడంలో దిట్ట అని పేర్కొంది.  చిత్రంలోని ప్రతి చిన్న పాత్రను కూడా సరిగ్గా చూపించారని అంది. నటుడు శివకార్తికేయన్‌ చాలా మంచి మనస్తత్వం కలిగిన వ్యక్తి అని చెప్పింది. యూనిట్‌లోని ప్రతి ఒక్కరినీ అభిమానంగా చూసుకుంటారని చెప్పింది. ఆయన మంచి నటుడే కాదని, మంచి దర్శకుడు శివకార్తికేయన్‌లో ఉన్నారని అంది. ఏదో ఒక రోజు ఆయన దర్శకత్వంలో నటించాలని కోరుకుంటున్నానని చెప్పింది. ఈ చిత్రం వెనుక ఉన్న సూపర్‌హీరోల గురించి ఆడియో ఆవిష్కరణ కార్యక్రమంంలోనే చెప్పానని, జిల్లనిపించే యువన్‌శంకర్‌రాజా సంగీతం, ఛాయగ్రాహకుడు జార్జ్‌ సీ.విలియస్‌ వంటి సాధికులతో కలసి పని చేశానన్నది ఇప్పటికీ తాను నమ్మలేకపోతున్నానని అంది. తనపై నమ్మకంతో ఇందులో కథానాయకిగా నటించడానికి తనను ఎంపిక చేసిన చిత్ర నిర్మాత రాజేశ్‌కు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానని నటి కల్యాణి ప్రియదర్శన్‌ పేర్కొంది.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

జైలు కాదు.... మనందరి మేలు

7 కోట్ల విరాళం

వైరస్‌ భయపడుతుంది!

అందరం ఒక్కటవ్వాల్సిన సమయమిది

అనుకున్న సమయానికే వస్తారు

సినిమా

జైలు కాదు.... మనందరి మేలు

7 కోట్ల విరాళం

వైరస్‌ భయపడుతుంది!

అందరం ఒక్కటవ్వాల్సిన సమయమిది

అనుకున్న సమయానికే వస్తారు

దండంబెట్టి చెబుతున్నా.. దండతో గోడెక్కకు