అఫీషియల్.. ఎన్టీఆర్ సినిమా బాబీతోనే..!

12 Dec, 2016 14:32 IST|Sakshi
అఫీషియల్.. ఎన్టీఆర్ సినిమా బాబీతోనే..!

జనతా గ్యారేజ్ సినిమా విడుదలై వందరోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా నందమూరి అభిమానులకు కళ్యాణ్ రామ్ గుడ్ న్యూస్ చెప్పాడు. ఇన్నాళ్లు తన నెక్ట్స్ సినిమా విషయంలో కన్ఫ్యూజ్ చేస్తున్న ఎన్టీఆర్ సినిమాపై క్లారిటీ ఇచ్చాడు. ప్రస్టీజియస్గా తెరకెక్కనున్న ఎన్టీఆర్ 27వ సినిమాను తన సొంతం నిర్మాణ సంస్థ ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ లో తెరకెక్కిస్తున్నట్టుగా తెలిపాడు కళ్యాణ్ రామ్. ఈ విషయాన్ని తన ట్విట్టర్ పేజ్ అఫీషియల్గా ఎనౌన్స్ చేశాడు కళ్యాణ్ రామ్.

ఈ సినిమాకు బాబీ దర్శకత్వం వహిస్తాడన్న క్లారిటీ కూడా ఇచ్చేశాడు. రవితేజ హీరోగా తెరకెక్కిన పవర్ సినిమాతో దర్శకుడిగా పరిచయం అయిన బాబీ, తరువాత సర్థార్ గబ్బర్సింగ్ సినిమాతో నిరాశపరిచాడు. పవన్ కళ్యాణ్ కథా కథనాలు అందించిన సర్థార్ గబ్బర్సింగ్ డిజాస్టర్ కావటంతో, బాబీ కెరీర్ డైలామాలో పడింది. ఈ సమయంలో ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరో చాన్స్ ఇవ్వటంతో మరోసారి తన స్టామినా ఏంటో ప్రూవ్ చేసుకోవాలనుకుంటున్నాడు దర్శకుడు బాబీ.

Load Comments
Hide Comments
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

కియారా కమిట్‌ అవుతుందా?

ఆ ఇద్దరి కాంబినేషన్‌లో..

విడుదలకు ముందే ఇంటర్నెట్‌లో..

అదో బోరింగ్‌ టాపిక్‌

తోట బావి వద్ద...

ఏంట్రా ఈ హింస అనుకున్నాను!