సముద్ర గర్భంలో సాహసాలు

28 Aug, 2018 10:07 IST|Sakshi

నందమూరి నటవారసుడిగా ఎంట్రీ ఇచ్చి స్టార్‌ ఇమేజ్‌ కోసం కష్టపడుతున్న యంగ్ హీరో కల్యాణ్ రామ్. అతనొక్కడే, పటాస్‌ లాంటి ఒకటి రెండు భారీ హిట్స్‌ ఉన్నా.. వరుస విజయాలు సాధించటంలో ఫెయిల్‌ అవుతున్నాడు కల్యాణ్‌ రామ్‌. ఈ ఏడాది ఎమ్మెల్యే, నా నువ్వే లాంటి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చినా పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు.

ప్రస్తుతం ఈ యంగ్ హీరో సినిమాటోగ్రాఫర్‌ గుహన్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం కల్యాణ్ రామ్‌ కొన్ని రిస్కీ స్టంట్స్‌ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. సముద్ర గర్భంలో ప్రమాదకర పరిస్థితుల్లో కొన్ని సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. విదేశాల నుంచి వచ్చిన డైవింగ్‌ ఎక్స్‌పర్ట్స్‌ పర్యవేక్షణలో డూప్‌ లేకుండా కల్యాణ్‌ రామ్‌ ఈ సన్నివేశాలు నటిస్తున్నారు. ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న ఈ సినిమా టైటిల్‌ను వినాయక చవితి సందర్భంగా సెప్టెంబర్‌ 13న రిలీజ్ చేసేందుకు ప్లాన్‌ చేస్తున్నారు.

మరిన్ని వార్తలు