ఐదే పాత్రలు

12 Dec, 2017 00:25 IST|Sakshi

నందు, శ్రీముఖి, కమల్‌ కామరాజు ముఖ్య తారలుగా వి.ఎస్‌. వాసు దర్శక త్వంలో తెరకెక్కిన సినిమా ‘కుటుంబ కథా చిత్రమ్‌’. భాస్కర గ్రూప్‌ ఆఫ్‌ మీడియా సమర్పణలో దాసరి భాస్కర్‌ యాదవ్‌ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 15న విడుదల కానుంది. ఈ సందర్భంగా నందు మాట్లాడుతూ– ‘‘ఇందులో సాఫ్ట్‌వేర్‌ కుర్రాడి పాత్ర చేశా. భార్యాభర్తల మధ్య జరిగే గొడవ వల్ల సినిమా థ్రిల్లర్‌ స్టైల్‌లో నడుస్తుంది. సోలో హీరోగానూ అవకాశాలొస్తున్నాయి. నటుడిగా నేను చాలా సంతృప్తిగా ఉన్నా. కథలో నా పాత్రకు ప్రాధాన్యం ఉంటేనే ఒప్పుకుంటున్నా. ఓ టీమ్‌ ఏర్పాటు చేసుకుని ఫీచర్‌ ఫిలిం ప్లాన్‌ చేసుకుంటున్నా. ఆ ప్రాసెస్‌లో ‘వై నాట్‌ ఎ గర్ల్‌’ అనే షార్ట్‌ ఫిలిం చేశా. వెబ్‌ సిరీస్‌లు చేయమని అవకాశాలొస్తున్నాయి. టేకప్‌ చేయాలి’’ అన్నారు.

కమల్‌ కామరాజు మాట్లాడుతూ–‘‘కాటమరాయుడు, అర్జున్‌రెడ్డి’ చిత్రాల తర్వాత నేను చేసిన సినిమా ఇది. నిర్మాత రాజ్‌ కందుకూరిగారు కథ వినమంటూ దర్శకుడు వాసుని నావద్దకు పంపించారు. వాసుని చూడగానే ఇతను సినిమా తీయగలడా? అని భయమేసింది. కానీ, తను కథ చెబుతున్నప్పుడు నేను ఎంజాయ్‌ చేశా. స్క్రీన్‌ప్లే చూసి హాలీవుడ్‌ సినిమా నుంచి కాపీ కొట్టాడా? అనిపించింది. అంత బాగా ఉంటుంది. ఐదు పాత్రలతో నడిచే సినిమా ఇది. ఇప్పటి పరిస్థితుల్లో కుటుంబంలోని అనుబంధాలను ఎలా మిస్‌ అవుతున్నామని చూపించాం. కథకి థ్రిల్లింగ్‌ అంశాలు జోడించటం వల్ల ప్రేక్షకులకు ఎక్కడా బోర్‌ అనిపించదు. నాది నెగటివ్‌ క్యారెక్టర్‌. ప్రస్తుతం రెండు సినిమాలకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చా’’ అన్నారు.

మరిన్ని వార్తలు