అమెరికాలో పంద్రాగస్టు వేడుకలకు కమల్‌

21 Jul, 2018 08:20 IST|Sakshi
కమల్‌తో శ్రుతీహాసన్‌

తమిళసినిమా: పంద్రాగస్ట్‌ వేడుక దగ్గర పడుతోంది. ఎందరో పోరాటయోధుల త్యాగఫలం స్వాతంత్ర దినోత్సవం. ఆగస్ట్‌ 15న యావత్‌ భారతదేశంలో అశోక చక్రాన్ని ఇముడ్చుకున్న మువ్వన్నెల పతాకం రెపరెపలాడే తరుణం దగ్గరపడింది.

ఈ వేడుకలు భారతదేశంలోనే కాకుండా అమెరికా వంటి అగ్రరాజ్యాల్లో కూ డా జరగుతుంటాయి. వేడుకల్లో వివిధ దేశాలకు చెందిన పలువురు సెలబ్రిటీలు పాల్గొం టుంటారు. ఈ ఏడాది అమెరికాలోని న్యూ యార్క్‌లో జరగనున్న వేడుకల్లో విశ్వనటుడు, మక్కళ్‌ నీది మయ్యం పార్టీ అధినేత కమలహాసన్, ఆయన కూతరు శ్రుతీ హాసన్‌ పాల్గొననున్నారన్నది తాజా సమాచారం. ప్రస్తుతం కమల్‌హాసన్‌ బిగ్‌బాస్‌ రియాలిటీ గేమ్‌ షోలో పాల్గొంటున్నారు. మక్కళ్‌ నీ ది మయ్యం పార్టీ కార్యక్రమాలతో బిజీగా ఉన్నారు. నటి శ్రుతి హాసన్‌ చిన్న గ్యాప్‌ తరువాత హిందీ చిత్ర షూటింగ్‌లో పాల్గొంటున్నారు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా