ఎట్టకేలకు రిలీజ్‌ డేట్‌ ప్రకటించాడు

11 Jun, 2018 11:22 IST|Sakshi

ఉళగనాయగన్‌(లోకనాయకుడు) కమల్‌ హాసన్‌ తదుపరి చిత్రం విశ్వరూపం-2 చిత్ర విడుదల తేదీని ఎట్టకేలకు ప్రకటించారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆగష్టు 10న ఈచిత్రం విడుదల కానున్నట్లు కమల్‌​ ఈ ఉదయం తెలిపారు. కాగా, ఈ చిత్ర ట్రైలర్‌ను నేటి సాయంత్రం ఆవిష్కరించున్నారు. 

తమిళ్‌, హిందీలో ఏకకాలంలో చిత్రం రూపొందించగా, తెలుగులో డబ్‌ కానుంది. సాయంత్రం 5 గంటలకు తెలుగు ట్రైలర్‌ను ఎన్టీఆర్‌, తమిళ ట్రైలర్‌ను కమల్‌ తనయ శృతిహాసన్‌, హిందీ ట్రైలర్‌ను అమీర్‌ ఖాన్‌ విడుదల చేస్తారు.

వివాదాల నడుమే విడుదలైన మొదటి పార్ట్‌కు మంచి స్పందన కాగా, రెండో భాగం మాత్రం జాప్యం అవుతూ వస్తోంది. కమల్‌ రాజకీయ ఆరంగ్రేటం నేపథ్యంలో విశ్వరూపం-2 చిత్రం విడుదల అన్ని వర్గాల్లో ఆసక్తిని రేపుతోంది. కమల్‌ హాసన్‌ డైరెక్షన్‌లో తెరకెక్కిన ఈ చిత్రంలో పూజా కుమార్‌, ఆండ్రియా హీరోయిన్లు కాగా, గిబ్రాన్‌ సంగీతం అందిస్తున్నాడు. 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా