నటనపై ఆసక్తి తగ్గలేదు

28 Nov, 2013 04:43 IST|Sakshi
నటనపై ఆసక్తి తగ్గలేదు
నాకిప్పటికీ నటనపై ఆసక్తి ఏ మాత్రం కొరవడలేదని నటరాజు, పద్మశ్రీ కమలహాసన్ వ్యాఖ్యానించారు. ఆయన ఐదేళ్ల వయసులోనే కళామతల్లి ఒడిలో పాఠాలు నేర్చారు. కళామతల్లి ముద్దుబిడ్డగా, సకల కళా వల్లభుడిగా పేరుపొందారు. ఆయన ప్రస్తుతం గోవాలో జరుగుతున్న 44వ అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లో ప్రత్యేక అతిథిగా పాల్గొన్నారు. అక్కడ పత్రికల వారికి ఇంటర్వ్యూ ఇచ్చారు. 
 
గోవా అనుభవం గురించి?
జ: నేను తొలిసారిగా గోవాకు ఏక్ తుజే కేళియే చిత్ర షూటింగ్ కోసం వెళ్లాను. అది నా 101వ చిత్రం. గోవా నాకు చాలా ముఖ్యమైంది. గోవాలోని ఆహార పదార్థాలు నాకు నచ్చుతాయి.
 
  కేరళకు చెందిన వారు మిమ్మల్ని మలయాళీగా భావిస్తున్నారే?
  ఆశ్చర్యమైన విషయం అదే. నేనిప్పటి వరకు 50 మలయాళ చిత్రాల్లో నటించాను. అందువల్లనే ఆ చిత్ర పరిశ్రమ నన్ను మలయాళి నటుడిగానే భావిస్తోంది. అక్కడి నుంచి తమిళ చిత్ర పరిశ్రమకు వచ్చాననుకుంటున్నారు.
 
  హిందీ చిత్రాల్లో ఎందుకు నటించడం లేదు?
  ఛాలెంజింగ్‌తో కూడిన వైవిధ్యభరిత పాత్రలు లభిస్తే మళ్లీ హిందీ చిత్రాల్లో నటించడానికి నేనెప్పుడూ సిద్ధమే. సాదాసీదా పాత్రల్లో నటించడం అర్థం లేని విషయం. కొత్తగా ఎల్లలు రూపొందిం చుకోవడం, మరికొందరి అభిమానులను పొంద డం, నప్పే పాత్రల్ని ఎంపిక చేసుకోవడం అవశ్యం. 
 
  మీ కుమార్తె శ్రుతిహాసన్ గురించి?
  ఒక నటిగా శ్రుతి నుంచి చాలా ఆశిస్తున్నాను. చిన్న వయసులోనే పలు షూటింగ్ సెట్స్ చూసిన అమ్మాయి. సంగీతాన్ని సంప్రదాయ బద్ధంగానే ర్చుకున్న కళాకారిణి. శ్రుతి చాలా సాధించింది.
 
 విశ్వరూపం వివాదం ఆ చిత్ర విజయానికి దోహద పడిందనే వాదనకు మీ సమాధానం?
  వివాదాలు చిత్ర విజయానికి దోహదపడవు. విశ్వరూపం చిత్రం విజయం సాధించడం వల్లే దానికి సీక్వెల్ రూపొందిస్తున్నట్లు జరుగుతున్న ప్రచారం కరెక్ట్ కాదు. చిత్ర నిర్మాణ దశలోనే రెండవ భాగం తీయాలని నిర్ణయించాను. 
 
  మీ సినీ పయనం సంతృప్తినిచ్చిందా?
  నేనిప్పటి వరకు పొందిన అవార్డులకు ఇంకా బాధ్యుడనై ఉండాలి. పలు కొత్త ప్రయోగాలు చేయాలనే ఆలోచనలు కలుగుతున్నాయి. నేను 25 ఏళ్ల వయసులోనే 100 చిత్రాల మైలురాయిని దాటిన నటుడిని. అయి నా ఇప్పటికీ నటనపై ఏ మాత్రం ఆసక్తి కొరవడలేదు. వినూత్న ప్రయోగాలు అభిమానులకు ఎంత ముఖ్యమో నటులకు అంతే ముఖ్యం.