క్యాస్టింగ్‌ కౌచ్‌ని సమర్థిస్తే వాళ్లను తక్కువ చేయడమే

26 Apr, 2018 00:28 IST|Sakshi
కమల్‌ హాసన్‌

క్యాస్టింగ్‌ కౌచ్‌ని సమర్థిస్తూ ‘‘క్యాస్టింగ్‌ కౌచ్‌ అన్ని చోట్లా ఉంది. కేవలం సినీ పరిశ్రమను ఎందుకు నిందిస్తారు? ఇండస్ట్రీ కనీసం ఉపాధి అయినా కల్పిస్తోంది. మిగతా చోట్లల్లా మహిళలను వాడుకొని వదిలేయడం లేదు కదా?’’ అని బాలీవుడ్‌ కొరియోగ్రాఫర్‌ సరోజ్‌ ఖాన్‌ కామెంట్‌ చేసిన విషయం తెలిసిందే.

సరోజ్‌ ఖాన్‌ చేసిన ఈ కామెంట్‌ కరెక్టేనా? అన్న ప్రశ్నను కమల్‌ హాసన్‌ ముందుంచితే ఆయన స్పందిస్తూ– ‘‘నేను ఇండస్ట్రీకి సంబంధించిన వాడిని కాబట్టి ఈ ప్రశ్నకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత నా మీద ఉంది. క్యాస్టింగ్‌ కౌచ్‌ మీద కూర్చోవాలా వద్దా? లేకపోతే ఆ కౌచ్‌ని కాళ్లతో తన్నేయాలా అన్నది పూర్తిగా ఆ మహిళ రైట్‌. కానీ క్యాస్టింగ్‌ కౌచ్‌ని సమర్థిస్తూ దానికి ఫేవర్‌గా మాట్లాడితే ఇండస్ట్రీలో ఉన్న నా చెల్లెళ్లు, కూతుళ్ల రైట్స్‌ను తగ్గించటమే. వాళ్లను తక్కువ చేయడమే అవుతుంది’’ అని పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు