అమ్మ చేసింది తప్పు

15 Jul, 2018 02:06 IST|Sakshi

... అని కమల్‌హాసన్‌ నిర్మొహమాటంగా తన అభిప్రాయాన్ని బయటపెట్టారు. ‘అమ్మ’ (అసోసియేషన్‌ ఆఫ్‌ మలయాళం మూవీ ఆర్టిస్ట్స్‌) అంటే మలయాళం నటీనటుల సంఘం అని అర్థం. గతేడాది నటి భావన కారులో ప్రయాణిస్తున్నప్పుడు లైంగిక వేధింపులకు గురైన విషయం తెలిసిందే. ఈ సంఘటన వెనకాల నటుడు దిలీప్‌ హస్తం ఉందని భావన ఆరోపించారు. ఆమె ఫిర్యాదుని పరిశీలించి, పోలీసులు దిలీప్‌ను అరెస్ట్‌ చేయడం, ఆయన బెయిల్‌పై బయటకు రావడం జరిగాయి.

కాగా, ‘అమ్మ’లో దిలీప్‌ సభ్యత్వాన్ని రద్దు చేశారు. ఇప్పుడు మళ్లీ ఆయనకు సభ్యత్వం ఇచ్చారు ఇటీవల ‘అమ్మ’ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన మోహన్‌లాల్‌. ఈ నిర్ణయంపై బాధితురాలు భావనతో సహా పలువురు కథానాయికలు బాహాటంగానే నిరసన వ్యక్తం చేశారు. ఆరోపణలు ఎదుర్కొన్న వ్యక్తికి మళ్లీ సభ్యత్వం ఎలా ఇస్తారు? అని ‘అమ్మ’ని నిలదీశారు. ఈ విషయం గురించి కమల్‌హాసన్‌ స్పందించారు. ‘‘చట్టపరంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తికి సభ్యత్వం ఇవ్వడం తప్పు. ఒకవేళ దిలీప్‌ని క్షమించాలనుకుంటే వ్యక్తిగతంగా చేయొచ్చు.

అయితే ఓ అసోసియేషన్‌ తీసుకునే నిర్ణయానికి సభ్యులందరి ఆమోదం ఉండాలి. దిలీప్‌ని వెనక్కి తీసుకోవడం సరైన నిర్ణయం కాదని ‘అమ్మ’లో ఉన్న పలువురు అంటున్నారు. ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకున్నప్పుడు మొత్తం సభ్యులందరితో చర్చించాలి. అలా కాకుండా అతనికి సభ్యత్వం ఇచ్చి, బాధిత నటికి అన్యాయం చేశారు. ఆర్టిస్టులందరి కలయికతో ఏర్పడేదే ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌. అది సజావుగా సాగాలంటే అందరి సహకారం కావాలి’’ అన్నారు కమల్‌. చిత్రసీమలో లింగ వివక్ష గురించి మాట్లాడుతూ – ‘‘మిగతా చిత్రపరిశ్రమలతో పోల్చితే మలయాళంలో లింగ వివక్ష తక్కువ’’ అన్నారు కమల్‌.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

‘కబీర్‌ సింగ్‌’ ఓ చెత్త సినిమా..!

శాటిలైట్‌ బిజినెస్‌లోనూ ‘సరిలేరు నీకెవ్వరు’

ఆయనను తాత అనకండి ప్లీజ్‌!!

పెళ్లి చేసుకున్న ఒకప్పటి హీరోయిన్‌!

‘శ్వాస’ ఆగిపోయిందా?

గ్యాంగ్‌ లీడర్‌పై ఏజెంట్ ఎఫెక్ట్‌!

27వ పడిలో షారుఖ్‌ ఖాన్‌

షాట్‌ల కాల్చినం తమ్మీ.. లైట్‌ తీస్కో!

ప్రశ్నించడమే కాదు.. ఓటు కూడా వేయాలి

హృతిక్‌ చేస్తే కరెక్ట్‌; సునయనది తప్పా!?

బిగ్‌బాస్‌.. అప్పుడే నాగ్‌పై ట్రోలింగ్‌!

చెన్నై ప్రజలకు మంచు మనోజ్‌ సాయం

‘జెర్సీ’ రీమేక్‌లో ‘కబీర్‌ సింగ్‌’

‘అవును వారిద్దరూ విడిపోయారు’

‘రాక్షసుడు’ని భయపెడుతున్నారు!

నీటి పొదుపుకై రజనీ అభిమానుల ర్యాలీ

కల్కి : ఆలస్యమైనా.. ఆసక్తికరంగా!

ది గ్రేట్‌ తెలుగు బ్రాండ్‌

తమిళ అబ్బాయితోనే పెళ్లి అంటోన్న హీరోయిన్‌

భావ స్వేచ్ఛకు హద్దులుండవా?

కామ్రేడ్‌ కోసం

చిన్న విరామం

నవాజ్‌ కోసమే నటిస్తున్నా

జై సేన సూపర్‌హిట్‌ అవ్వాలి

తలచినదే జరిగినదా...

నా శత్రువు నాతోనే ఉన్నాడు

పండగ ఆరంభం

కంగారేం లేదు

కొత్త డైరెక్టర్లు నన్ను కలవొచ్చు

నితిన్‌.. కీర్తి.. రంగ్‌ దే

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

చెన్నై ప్రజలకు మంచు మనోజ్‌ సాయం

గ్యాంగ్‌ లీడర్‌పై ఏజెంట్ ఎఫెక్ట్‌!

షాట్‌ల కాల్చినం తమ్మీ.. లైట్‌ తీస్కో!

పెళ్లి చేసుకున్న ఒకప్పటి హీరోయిన్‌!

‘కబీర్‌ సింగ్‌’ ఓ చెత్త సినిమా..!

ఆయనను తాత అనకండి ప్లీజ్‌!!