నేనెప్పుడూ బాస్‌ని కాదు!

28 May, 2017 00:18 IST|Sakshi
నేనెప్పుడూ బాస్‌ని కాదు!

ఎప్పుడైతే అహంకారం స్టార్టవుతుందో ఆ క్షణమే డౌన్‌ ఫాల్‌కు పునాది పడుతుందన్న సూత్రాన్ని  తాను పాటిస్తానంటున్నారు కమల్‌హాసన్‌. తమిళ ‘బిగ్‌ బాస్‌’ షోతో ఆయన బుల్లితెరకు ఎంట్రీ ఇస్తున్నారు. ఈ సందర్భంగా కమల్‌ మాట్లాడారు. ‘‘టీవీ కోసం బిగ్‌ బాస్‌ షో చేస్తున్నాను కానీ, నిజానికి నేనెప్పుడూ బాస్‌లా ఫీలవ్వను. అలాగే ఈ షోకి కూడా బాస్‌ని కాదు.

సొంత బ్యానర్‌లో సినిమాలు నిర్మిస్తున్నా అధినేతనన్న భావనను దరి చేరనివ్వను’’ అన్నారు. టీవీ ఎంట్రీపై మీ ఫీలింగ్స్‌ అనే ప్రశ్న కమల్‌ ముందుంచితే – ‘‘నాకొచ్చిన ప్రతి అవకాశాన్ని మొదటి ఛాన్స్‌లానే భావించి కష్టడతాను. ఒకవేళ అలా ఆలోచించని నాడు  ఇండస్ట్రీ నుంచి తప్పుకోవాల్సిన పరిస్థితులు వస్తాయేమోనన్న ఫీలింగ్‌ నన్ను వెంటాడుతుంది’’ అన్నారు.