ఇండియన్‌-2: సేనాపతిగా కమల్‌ లుక్‌ ఇదే!

24 Oct, 2019 12:42 IST|Sakshi

సెట్స్‌లోని ఫొటోలు లీక్‌: సోషల్‌ మీడియాలో వైరల్‌

విభిన్నమైన పాత్రలు పోషించడంలో కమల్‌ హాసన్‌కు సాటిరాగల నటుడు మరొకరు లేరంటే అతిశయోక్తి కాకపోవచ్చు. తాను ఏ పాత్ర పోషించినా.. ఆ పాత్రకు వందశాతం న్యాయం చేసేందుకు ఆయన తపిస్తారు. ఒక అగ్రస్థాయి హీరో అయినప్పటికీ తన కెరీర్‌లో ఎన్నో వైవిధ్యభరితమైన పాత్రలను కమల్‌ పోషించారు. సినిమాల నుంచి క్రమంగా రాజకీయాలు వైపు అడుగులు వేసిన కమల్‌ హాసన్‌ త్వరలో ‘భారతీయుడు-2’ (ఇండియన్‌-2) సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.

‘భారతీయుడు’ సినిమాలో అవినీతిపరులైన ప్రభుత్వ అధికారులను హడలెత్తించే సేనాపతి పాత్రతో కమల్‌ తన విశ్వరూపం చూపిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ సినిమా సీక్వెల్‌లో ఆయన మరోసారి సేనాపతిగా తన ఫ్యాన్స్‌ను పలుకరించబోతున్నారు. భారతీయుడు-2లో ఆయన లుక్‌ ఎలా ఉంటుందనేది ఆసక్తి రేపుతోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ శరవేగంగా సాగుతుండగా.. సినిమా షూటింగ్‌కు సంబంధించి పలు ఫొటోలు లీకై సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తున్నాయి. తాజాగా ఈ సినిమాలో కమల్‌ లుక్‌ సంబంధించిన ఫొటో లీకైంది. షూటింగ్‌లో భాగంగా కమల్‌ మేకప్‌ వేసుకుంటుండగా తీసిన ఫొటో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. సేనాపతిగా కంప్లీట్‌గా డిఫరెంట్‌ లుక్‌లో కనిపిస్తున్న కమల్‌ మరోసారి ప్రేక్షకులను మెస్మరైజ్‌ చేయడం ఖాయమని ఈ ఫొటోపై నెటిజన్లు కామెంట్‌ చేస్తున్నారు.

ప్రముఖ దర్శకుడు శంకర్‌ దర్శకత్వంలో 2003లో వచ్చిన  ‘భారతీయుడు’ సినిమాకు ఇది సీక్వెల్‌. కమల్‌-శంకర్‌ కాంబోలో తెరకెక్కుతున్న ఈ సీక్వెల్‌లో కమల్‌ సరసన కాజల్‌ అగర్వాల్‌, రకుల్‌ ప్రీత్‌సింగ్‌ నటిస్తున్నారు. ప్రియాభవనీ శంకర్‌, సిద్ధార్థ, విద్యుత్‌జమాల్‌, ఢిల్లీ గణేశ్‌ వంటి ప్రముఖ తారలు నటిస్తున్న ఈ సినిమా షూటింగ్‌ ప్రస్తుతం శరవేగంగా సాగుతోంది.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

అసభ్యంగా తాకాడు: నటి షాకింగ్‌ కామెంట్స్‌

అ! తర్వాత నాని మరో సిన్మా... ‘హిట్‌’ గ్యారెంటీ!!

మహేష్‌బాబు ‘ఫ్యామిలీ’ ప్యాకేజీ!

విలన్‌ పాత్రల్లో కొంగరి జగ్గయ్య వారసుడు

దర్శకుడిపై హీరోయిన్‌ ఫిర్యాదు

బిగిల్‌కు తప్పని ఆంక్షలు

ఖాకీ వేస్తే పోలీస్‌... తీస్తే రౌడీ

మిస్‌ మార్వెల్‌ అవుతారా?

మైనస్‌ ఎనిమిది డిగ్రీల చలిలో...

పరమానందయ్య శిష్యులు

నాకొక బాయ్‌ఫ్రెండ్‌ కావాలి

మహిళలకు విజిల్‌ అంకితం

ప్రయాణానికి సిద్ధం

గాగాతో రాగాలు

షావుకారు జానకి @ 400

మత్తు వదలరా!

నా సొంత పగ అంటున్న సల్మాన్‌

సినీ నిర్మాత బండ్ల గణేశ్‌ అరెస్ట్‌

చిచ్చా గెలుపు.. ప్రతీకారం తీర్చుకుంటున్న ఫ్యాన్స్‌

రహస్య వివాహం చేసుకున్న నిక్కీ మినాజ్‌

జిమ్‌లో కష్టపడి ఈ కండలు పెంచాను!

రూమర్స్‌పై స్పందించిన కంగనా రనౌత్‌!

‘బాహుబలి’కి భల్లాలదేవ విషెస్‌

కీరవాణి తనయుల సిన్మా.. ఎన్టీఆర్‌ ట్వీట్‌!

బిగ్‌బాస్‌ ఇంట్లో సర్కస్‌, నేడే చూడండి!

‘వార్‌-2’: హృతిక్‌ను ప్రభాస్‌ ఢీకొడతాడా?

నటి బర్త్‌ డే పార్టీ: ప్రియుడితో స్టెప్పులు!

ఆయనతోనే జీవితం అనుకున్నా.. అందుకే..

సీన్‌ టు సీన్‌ అర్జున్‌రెడ్డే..!!

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

మహేష్‌బాబు ‘ఫ్యామిలీ’ ప్యాకేజీ!

విలన్‌ పాత్రల్లో కొంగరి జగ్గయ్య వారసుడు

బండ్ల గణేష్‌కు రిమాండ్‌, కడప జైలుకు తరలింపు

దర్శకుడిపై హీరోయిన్‌ ఫిర్యాదు

బిగిల్‌కు తప్పని ఆంక్షలు

ఖాకీ వేస్తే పోలీస్‌... తీస్తే రౌడీ