సేనాపతి.. గుజరాతీ

20 Nov, 2019 00:49 IST|Sakshi

సేనాపతి గుర్తున్నాడా? ఇక్కడ కమల్‌హాసన్‌ ఫొటో చూడగానే ‘భారతీయుడు’ సినిమాలో ఆయన చేసిన సేనాపతి పాత్ర గుర్తుకు రాక మానదు. ఇప్పుడు ‘భారతీయుడు’కి సీక్వెల్‌ చిత్రీకరణలో ఉంది. ఇందులో కమల్‌ చేస్తున్న సేనాపతి పాత్రకు 90 ఏళ్లు. రెండు రోజులుగా ఈ పాత్ర చిత్రీకరణ జరుగుతోంది. కాగా కొన్ని సన్నివేశాల్లో సేనాపతి గుజరాతీ భాష మాట్లాడతాడు. తాను ఈ భాష ఎలా మాట్లాడతారో కమల్‌ వినిపించారు కూడా. సినిమా పరిశ్రమలోకి వచ్చి కమల్‌ 60 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఇటీవల చెన్నైలో భారీ వేడుక జరిగింది. ఈ వేదికపై కమల్‌ ఒక గుజరాతీ వాక్యం మాట్లాడి ప్రేక్షకులను ఆశ్చర్యపరిచారు.

మరిన్ని వార్తలు