'ఉత్తమ విలన్'లో కమల్ ద్విపాత్రాభినయం

15 Mar, 2014 11:55 IST|Sakshi
'ఉత్తమ విలన్'లో కమల్ ద్విపాత్రాభినయం

కమల్హాసన్ ఉత్తమవిలన్ చిత్రం గురించి రోజుకో కొత్త విషయం వెలుగులోకి వస్తోంది. ఆయన ఈ సినిమాలో ద్విపాత్రాభినయం చేయబోతున్నారు. అదే తాజా అంశం. అందులో ఒక పాత్ర ఎనిమిదో శతాబ్దానికి చెందిన నాటక కళాకారుడిగా, మరో పాత్రలో 21వ శతాబ్దానికి చెందిన సినిమా నటుడిగా చేస్తున్నాడు. ఇందులో నాటక కళాకారుడి పాత్ర పేరు ఉత్తమన్ కాగా, సినిమా సూపర్స్టార్ పేరు మనోరంజన్ అని ఓ ప్రకటనలో సినిమా వర్గాలు తెలిపాయి.

అలాగే, ఈ సినిమాలో నటించే హీరోయిన్ల పేర్లు కూడా బయటకు వచ్చాయి. ఆండ్రియా జెర్మియా, పూజాకుమార్ ఇందులో నటిస్తున్నారు. వీళ్లలో మనోరంజన్ పక్కన ఆండ్రియా, ఉత్తమన్ పక్కన పూజాకుమార్ చేస్తారట. రమేష్ అరవింద్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో్ కె.విశ్వనాథ్, కె.బాలచందర్, జయరామన్, పార్వతీ మీనన్, ఊర్వశి, ఎంఎస్ భాస్కర్ కూడా నటిస్తున్నారు. తిరుపతి బ్రదర్స్ ఈ సినిమాకు నిర్మాతలు.