కమల్ @ 65

8 Nov, 2019 00:39 IST|Sakshi
ఇండియన్‌–2 పోస్టర్‌

గురువారం కమల్‌హాసన్‌ బర్త్‌డే. ఈ ఏడాదితో 65వ సంవత్సరంలో అడుగుపెట్టారు కమల్‌. అంతే కాదు నటుడిగా 60 ఏళ్లు పూర్తి చేసుకుంటున్నారు. 5 ఏళ్ల వయసులోనే బాల నటుడిగా పరిచయం అయ్యారు కమల్‌. ఈ బర్త్‌డేను కుటుంబ సభ్యులతో జరుపుకున్నారు కమల్‌హాసన్‌. కుటుంబ సమేతంగా (సోదరుడు చారుహాసన్, కుమార్తెలు శ్రుతీహాసన్, అక్షరాహాసన్‌) తమ స్వగ్రామం పరమకుడికి ప్రయాణం అయ్యారు. గురువారం నుంచి మూడురోజుల పాటు పుట్టినరోజు వేడుకలను ప్లాన్‌ చేశారు కమల్‌ కుటుంబ సభ్యులు. గురువారం తన తండ్రి (డి.శ్రీనివాసన్‌) విగ్రహాన్ని ఆవిష్కరించారు కమల్‌. శుక్రవారం దర్శకుడు బాలచందర్‌ విగ్రహావిష్కరణను ప్లాన్‌ చేశారు. కమల్‌ నటించిన ‘హే రామ్‌’ చిత్రం ప్రత్యేక ప్రదర్శన శనివారం చెన్నైలో జరగనుంది. ఇక పుట్టినరోజు సందర్భంగా కమల్‌ నటిస్తున్న తాజా చిత్రం ‘ఇండియన్‌ 2’ కొత్త పోస్టర్‌ను రిలీజ్‌ చేసింది చిత్రబృందం.

మరిన్ని వార్తలు