కంటికి కనిపించిందే నిజం కాదు!

22 May, 2018 12:00 IST|Sakshi

అవును. కంటికి కనిపించేవన్ని నిజాలు కాదు. లోతుగా పరిశీలించేస్తేనే నిజం తెలుస్తుందని అంటున్నారు లోక నాయకుడు కమల హాసన్‌. త్వరలో రాబోతున్న తమిళ బిగ్‌ బాస్‌ రెండో సీజన్‌కు కూడా ఈ యూనివర్సల్‌ హీరోనే వ్యాఖ్యాతగా వ్యవహరించనున్న సంగతి తెలిసిందే. ఇటీవలే విడుదల చేసిన బిగ్‌ బాస్‌ సీజన్‌ 2 మోషన్‌ పిక్చర్‌కు విశేష స్పందన వచ్చింది. తాజాగా ఈ రియాల్టీ షోకు సంబంధించిన ప్రోమోను విడుదల చేశారు. ఇప్పుడు ఇది వైరల్‌గా మారుతోంది. 

ఈ వీడియోలో.. ఓ ఆకతాయిలా కనిపించే కుర్రాడు... అకస్మాత్తుగా ఓ అమ్మాయిని ఢీ కొట్టి పరిగెత్తుకుంటుపోతాడు... చుట్టుపక్కన ఉన్నవారంతా తిట్టబోతుంటే... కమల్‌హాసన్‌ ఓ చిటికేసి ఆ సీన్‌ను పాజ్‌ చేస్తారు . కంటికి కనిపించేది నిజం కాదంటూ... వెనకాల ఏదో ఉంటుందంటూ కమలహాసన్‌ చెబుతారు. తీరా స్క్రీన్‌ మొదలైన వెంటనే ఆ కుర్రాడు ఓ పాపను ప్రమాదం నుంచి కాపాడడానికే అలా వెళ్తాడు. కంటికి కనపడకుండా ఉండే విషయాన్ని తెలుసుకుంటేనే నిజమేంటో అర్థమవుతుందని ముగింపునిస్తారు కమల్‌. వినూత్నంగా ఉన్న ఈ ప్రోమో కు మంచి స్పందన వస్తోంది. మరి బిగ్‌బాస్‌ సీజన్‌ ​2 ను కూడా ఈ హీరో రక్తికట్టించేలానే ఉన్నారు.

మరిన్ని వార్తలు