కమల్ కామరాజు నిశ్చితార్థం

8 Oct, 2013 00:18 IST|Sakshi
కమల్ కామరాజు నిశ్చితార్థం
గోదావరి, ఆవకాయ్ బిర్యానీ, కలవరమాయె మదిలో తదితర చిత్రాల్లో నటించిన కమల్ కామరాజు త్వరలో ఓ ఇంటివాడు కానున్నారు. తను ప్రేమించిన బెంగాలీ అమ్మాయి సుప్రియ బిశ్వాస్‌తో ఈ కుర్రహీరో నిశ్చితార్థం జరిగింది. 
 
 హైదరాబాద్‌లోని కమల్ కామరాజ్ స్వగృహంలో ఆదివారం జరిగిన నిశ్చితార్థానికి దర్శకులు శేఖర్ కమ్ముల, కమల్ కామరాజ్ బంధువు ,బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తా జ్వాల... తదితరులు హాజరయ్యారు.
 
 తన కాబోయే భార్య భోపాల్‌కు చెందిన అమ్మాయని, ప్రైవేట్ ఉద్యోగం చేస్తోందని కమల్ ఈ సందర్భంగా చెప్పారు. డిసెంబరు 13న హైదరాబాద్‌లో పెళ్లి జరుగనుందని కమల్ తెలియజేశారు.