లాకి కొత్త అర్థం చెప్పారు

14 Nov, 2018 00:27 IST|Sakshi

‘‘లా’ టైటిల్‌ చాలా బాగుంది. ‘లా’కి ‘లవ్‌ అండ్‌ వార్‌’ అని కొత్త అర్థం చెప్పారు గగన్‌ గోపాల్‌. ఈ చిత్రంతో కమల్‌ కామరాజు, మౌర్యాణిలకు మంచి పేరు వస్తుందని నమ్ముతున్నా. ‘లా’ సినిమా హిట్‌ అవుతుంది. 4 కోట్ల రూపాయల బడ్జెట్‌తో ఏపీలో సినిమా తీస్తే పన్నులన్నీ రద్దు చేస్తాం. లొకేషన్లు ఫ్రీగా ఇస్తాం’’ అని ఆంధ్రప్రదేశ్‌ ఎఫ్‌.డి.సి. చైర్మన్‌ అంబికా కృష్ణ అన్నారు. కమల్‌ కామరాజు, మౌర్యాణి, పూజా రామచంద్రన్‌ ముఖ్య తారలుగా గగన్‌ గోపాల్‌ ముల్కా డైరెక్షన్‌లో తెరకెక్కిన సినిమా ‘లా’ (లవ్‌ అండ్‌ వార్‌). రమేష్‌ బాబు మున్నా, మద్దిపాటి శివ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 23న విడుదలవుతోంది.

సత్య కశ్యప్‌ సంగీతం అందించిన ఈ చిత్రం పాటలను విజయవాడలో విడుదల చేశారు. కమల్‌ కామరాజు మట్లాడుతూ– ‘‘గగన్‌ రాసిన స్క్రీన్‌ ప్లే మా సినిమాకు ప్రధాన బలం. నేను ఈ సినిమా చేయడానికి ప్రధాన కారణం కథే. ఈ చిత్రానికి కథే హీరో. మంచి ట్విస్టులు ఉంటాయి. రమేష్‌ బాబు మున్నా, మద్దిపాటి శివ లేకపోతే ఈ సినిమా లేదు’’ అన్నారు. ‘‘లా’ సినిమా కథను అందరు ఆర్టిస్టులు ఒకే సిట్టింగ్‌లో ఓకే చేశారు. కమల్‌ కామరాజు, మౌర్యాణి, పూజ  చాలా సహకరించారు’’ అని గగన్‌ గోపాల్‌ అన్నారు. రమేష్‌ బాబు, మౌర్యాణి, పూజా రామచంద్రన్, సత్య కశ్యప్, నటి మంజు భార్గవి తదితరులు పాల్గొన్నారు.  

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు