కామ్నకు పెళ్లయిపోయిందా?

13 Dec, 2013 00:48 IST|Sakshi
కామ్నకు పెళ్లయిపోయిందా?
కథానాయిక కామ్న జఠ్మలానీకి పెళ్లయిపోయిందా? మూడు నెలల క్రితమే ఆమె పెళ్లి చేసుకున్నారనే వార్త వెబ్‌సైట్స్‌లో హల్‌చల్ చేస్తోంది. బెంగళూరుకి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త సూరజ్‌తో ఆమె వివాహం జరిగిందని, ఆ వేడుకకు తనకు బాగా సన్నిహితులైన ఇద్దరు కథానాయికలను మాత్రమే కామ్న ఆహ్వానించారని వినికిడి. ‘ప్రేమికులు’ సినిమాతో నాయికగా తెలుగు తెరకు పరిచయమైన ఈ ముంబై భామ రణం, సామాన్యుడు, బెండు అప్పారావు ఆర్‌ఎంపీ లాంటి సినిమాలు చేశారు. ఇటీవలే ‘భాయ్’లో నాగార్జునతో కలిసి నటించారు. ఈ పెళ్లి వార్త రూమరా? ఒకవేళ నిజమైతే కామ్న ఎందుకు రహస్యంగా ఉంచినట్టు? అసలు నిజం కామ్నానే చెప్పాలి.