ఫిబ్రవరిలో ప్రముఖ నటి పెళ్లి

21 Nov, 2019 16:14 IST|Sakshi

ప్రముఖ సీరియల్‌ నటి కామ్యా పంజాబీ త్వరలో పెళ్లి పీటలెక్కనుంది. వ్యాపారవేత్త షలబ్‌దాంగ్‌తో పీకల్లోతు ప్రేమలో ఉన్న కామ్యా దాన్ని వివాహబంధంగా మార్చేందుకు అడుగులు వేసింది. దీనికి సంబంధించిన విషయాన్ని తన ఇన్‌స్టాగ్రామ్‌లో వెల్లడించింది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 10న వివాహం చేసుకోనున్నట్లు ప్రకటించింది. దీంతో అభిమానులు పెద్ద ఎత్తున ఆమెకు శుభాకాంక్షలు అందజేస్తున్నారు.తన ప్రియుడితో కలిసి ఫిబ్రవరి 10 నుంచి వైవాహిక బంధంతో కొత్త జీవితాన్ని ప్రారంభించబోతున్నట్లు కామ్యా పంజాబీ  రాసుకొచ్చింది. అయితే ఆమె గతంలో బంటీ నేగీ అనే వ్యాపారవేత్తను పెళ్లి చేసుకున్నారు. పదేళ్ల దాంపత్యం అనంతరం 2013లో వాళ్లిద్దరూ విడాకులు తీసుకున్నారు. ఇక పలు సీరియల్స్‌లో కీలక పాత్రలు పోషిస్తున్న కామ్యా.. హిందీ బిగ్‌బాస్‌ సీజన్‌ 7లో పాల్గొని ప్రేక్షకులకు మరింత చేరువయ్యారు.

So here i m with my fav picture with my fav man announcing my fav date #10thFeb2020 ❤️ Bless Us for this New Journey New Beginnings 🙏🏻

A post shared by Kamya Panjabi (@panjabikamya) on

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా