కాంచన 4 ఉంటుంది

25 Apr, 2019 02:21 IST|Sakshi

– లారెన్స్‌

‘‘కాంచన 3’ కోసం రెండు సంవత్సరాలు కష్టపడ్డాను. ప్రేక్షకులకు నచ్చుతుందా? లేదా? అని నేను 100 సార్లు సినిమా చూసుంటాను. ఇప్పుడు ఈ చిత్రాన్ని చూసి ప్రేక్షకులు ఎంజాయ్‌ చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ చేసిన ప్రేక్షకులకు థ్యాంక్స్‌’’ అని రాఘవ లారెన్స్‌ అన్నారు. రాఘవ లారెన్స్‌ హీరోగా నటించి, దర్శకత్వం వహించిన చిత్రం ‘కాంచన 3’. వేదిక, నిక్కీ తంబోలి కథానాయికలు. రాఘవ నిర్మించిన ఈ చిత్రాన్ని తెలుగులో లైట్‌హౌస్‌ మూవీ మేకర్స్‌ బేనర్‌పై ‘ఠాగూర్‌’ మధు ఈనెల 19న విడుదల చేశారు.

హైదరాబాద్‌లో బుధవారం జరిగిన గ్రాండ్‌ సక్సెస్‌మీట్‌లో లారెన్స్‌ మాట్లాడుతూ– ‘‘కాంచన 3’తో డిస్ట్రిబ్యూటర్స్‌ చాలా హ్యాపీ. ఈ సినిమాతో మధుగారికి మంచి పేరు వచ్చినందుకు సంతోషం. డిస్ట్రిబ్యూటర్స్, నిర్మాతలతో పాటు మా ఫ్యామిలీ మెంబర్స్‌ కూడా వెంటనే ‘కాంచన 4’ స్టార్ట్‌ చేయమని చెబుతున్నారు. ఫ్లాష్‌బ్యాక్‌లో వచ్చే మెయిన్‌ పాయింట్‌ కోసం రీసెర్చ్‌ చేస్తున్నాను. మంచి పాయింట్‌ దొరికితే త్వరగా స్టార్ట్‌ చేయాలని నాకూ ఉంది.  నేను నెలకొల్పిన ట్రస్ట్‌ బాగా నడుస్తోంది.

హైదరాబాద్‌లో స్టార్ట్‌ చేయడానికి అన్నయ్య చిరంజీవిగారు 10 లక్షలు సహాయం చేశారు. ‘కాంచన 3’ నుంచి 50 లక్షలు ఇచ్చాను. ‘కాంచన’ హిందీ రీమేక్‌ని హీరో అక్షయ్‌ కుమార్‌తో చేస్తున్నాను. రెండు వారాలు షూటింగ్‌ అయిపోగానే నా ట్రస్ట్‌కి సహాయం కోసం వచ్చినవారిని నేనే స్వయంగా కలుసుకొని వారికి తగిన సహాయం చేస్తాను. ‘కాంచన 2’ కూడా 100 కోట్లు వసూలు చేసింది. అప్పటి నుండి ఒక భయం ఏర్పడింది. ఇప్పుడు ‘కాంచన 3’ చిత్రం 10 రోజుల్లోనే 100 కోట్లకుపైగా వసూలు చేయడానికి రెడీగా ఉంది.

దీనంతటికీ కారణం మా అమ్మ ఆశీర్వాదం, ఆ రాఘవేంద్ర స్వామి దయ. ‘జెర్సీ’ సినిమా చూశాను. చాలా బాగుంది. అందరూ చూడండి’’ అన్నారు. ‘‘కాంచన 3’ సినిమాని బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ చేసిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకూ 75 కోట్లకు పైగా వసూలు చేసింది. రెండు, మూడు రోజుల్లో 100 కోట్ల మార్క్‌ని క్రాస్‌ చేసి, ‘కాంచన 2’ వసూళ్లను దాటబోతోంది’’ అని ‘ఠాగూర్‌’ మధు అన్నారు. నిర్మాత బి.ఎ. రాజు, డిస్ట్రిబ్యూటర్స్‌ భరత్‌చౌదరి, వీర్నినాయుడు, హీరోయిన్లు వేదిక, నిక్కీ తంబోలి తదితరులు మాట్లాడారు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

విడిపోయినంత మాత్రాన ద్వేషించాలా?!

‘రారా.. జగతిని జయించుదాం..’

‘ఆ సెలబ్రిటీతో డేటింగ్‌ చేశా’

ఎన్నాళ్లయిందో నిన్ను చూసి..!!

మహేష్‌ సినిమా నుంచి అందుకే తప్పుకున్నా..

‘నా ఇష్టసఖి ఈ రోజే పుట్టింది’

‘మిస్టర్‌ కెకె’ మూవీ రివ్యూ

బిగ్‌బాస్‌ మాజీ కంటెస్టెంట్‌ అరెస్టు

పీవీ కూడా ఆయన అభిమాని అట...

‘సాహో’ విడుదల ఎప్పుడంటే..?

‘ది లయన్‌ కింగ్‌’.. ఓ విజువల్‌ వండర్‌!

ఘోర రోడ్డు ప్రమాదం : బాలనటుడు దుర్మరణం 

గర్భంతో ఉన్న చిత్రాలను విడుదల చేసిన శ్రుతి

నాన్నకు ప్రేమతో మిస్సయ్యాను

ఎక్కడైనా ఒకేలా ఉంటా

అడ్డంకులు మాయం!

కుశాలీ ఖుషీ

నిశ్శబ్దాన్ని విందాం

నేనంటే భయానికి భయం

సినిమాలో చేసినవి నిజంగా చేస్తామా?

వందమందితో డిష్యూం డిష్యూం

ఎర్రచీర సస్పెన్స్‌

నా పేరే ఎందుకు?

ఇలా ఉంటా!

నాగార్జున ఇంటి వద్ద పోలీసు బందోబస్తు

ఢిల్లీకి చేరిన ‘బిగ్‌బాస్‌’ వివాదం

మూడోసారి తండ్రి అయిన హీరో!

లిప్ లాక్‌పై స్పందించిన విజయ్‌ దేవరకొండ

తిడతావేంటమ్మా.. నువ్వేం మారలేదు!

నమ్మకముంటే ఏదైనా సాధించవచ్చు..

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

విడిపోయినంత మాత్రాన ద్వేషించాలా?!

‘రారా.. జగతిని జయించుదాం..’

‘ఆ సెలబ్రిటీతో డేటింగ్‌ చేశా’

ఎన్నాళ్లయిందో నిన్ను చూసి..!!

మహేష్‌ సినిమా నుంచి అందుకే తప్పుకున్నా..

‘నా ఇష్టసఖి ఈ రోజే పుట్టింది’