కేరాఫ్‌ కాంట్రవర్సీ

22 Mar, 2018 00:13 IST|Sakshi
కంగనా రనౌత్‌

ఒక్కసారి మనం కాంట్రవర్సీలో కాలు పెడితే చాలు తర్వాత అక్కర్లేని కాంట్రవర్సీలన్నీ వచ్చి చుట్టుకుంటాయి అని చెప్పటానికి కంగనా రనౌత్‌ ఓ ఉదాహరణ. విషయం ఏంటంటే.. సీడీఆర్‌ (కాల్‌ డీటైల్‌ రికార్డ్‌) వివాదం. ప్రస్తుతం బాలీవుడ్‌లో హాట్‌ టాపిక్‌. బాలీవుడ్‌ సెలబ్రిటీ లాయర్‌ రిజ్వాన్‌ సిద్ధికీ చట్ట వ్యతిరేకంగా తన క్లైయింట్స్‌కు సీడీఆర్‌లు అందిస్తున్నారని ఆరోపణలు వచ్చాయి. నటుడు నవాజుద్దిన్‌ సిద్ధికీ భార్య కాల్‌ డేటాను అక్రమ మార్గాల్లో సంపాదించారని లాయర్‌ రిజ్వాన్‌ను అదుపులోకి తీసుకున్నారు థానే పోలీసులు. తీగ లాగితే డొంక కదిలినట్టు ఇప్పుడీ కేసు కంగనా కాలుకి కూడా చుట్టుకుంది. ఈ సీడీఆర్‌ వివాదంలో కంగనా కూడా ఉన్నారంటూ ఆరోపించారు థానే పోలీసులు.

‘‘కంగనా–హృతిక్‌ రోషన్‌ ప్రేమ వ్యవహారం కేసు విషయం ఇంకా నడుస్తున్న విషయం తెలిసిందే. 2016లో లాయర్‌ రిజ్వాన్‌కు కంగనా హృతిక్‌ రోషన్‌ నంబర్‌ను ఇచ్చినట్టు మా ఇన్వెస్టిగేషన్‌లో తెలిసింది. దాని వెనకాల అసలు కారణం ఏంటో తెలియాల్సి ఉంది’’ అని పేర్కొన్నారు థానే పోలీసులు. దానికి కంగనా సిస్టర్‌ రంగోలీ స్పందిస్తూ – ‘‘ఏదైనా కోర్ట్‌ నోటీసుకి రెస్పాండ్‌ అయినప్పుడు మా డీటైల్స్‌ అన్నీ లాయర్‌కు సమర్పిస్తాం. వాటిని ఆధారం చేసుకొని మేము చట్టాన్ని అతిక్రమిస్తున్నాం అని ఊహించేసుకొని వాటి ద్వారా స్టేట్‌మెంట్స్‌ పాస్‌ చేయడం ఒక ఆర్టిస్ట్‌ని తక్కువ చేయడమే అవుతుంది. అది తప్పు.  పూర్తి స్థాయి ఇన్వెస్టిగేషన్‌ జరిపాక ఆరోపణలు చేస్తే బావుంటుంది’’ అని ట్విట్టర్‌లో పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు